న్యూఢిల్లీ: కాకినాడ పోర్టు, సెజ్‌లో కేవీ రావు సంస్థ కెఎస్‌పీఎల్ నుంచి బెదిరించి వాటాలు రాయించుకున్నారని ఆరోపిస్తూ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, తనపై లుకౌట్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ పక్షనేత శ్రీ వి.విజయసాయిరెడ్డి. చంద్రబాబు కుట్రలో భాగంగానే కేవీరావు ఫిర్యాదు చేశారన్న ఆయన, ఆ ఆరోపణలన్నీ సత్యదూరమని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో వి.విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారంటే..: కేవీరావు చంద్రబాబు మనిషి. బ్రోకర్: – పవన్‌కళ్యాణ్‌ను సముదాయించుకునేందుకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విషయాన్ని చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నాడు. – కేవీ రావు అనే వ్యక్తి అబద్ధాలకోరు. ఆయన ఒక బ్రోకర్. తనకు నిజంగా అన్యాయం జరిగి ఉంటే నాలుగున్నరేళ్లు ఏం చేస్తున్నట్లు?. కోర్టులను ఆశ్రయించకుండా ఈరోజు ఎందుకు కేసులు పెడుతున్నారు?. – కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు బ్రోకర్. ఆయన చెంచా. కేవీ రావు వెనుక చంద్రబాబు ఉండి ఈ కథను నడిపిస్తున్నాడని ఖచ్చితంగా చెబుతున్నా. – 2018లో కేవీరావుపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చూస్తే కేవీ రావు ఎంత బ్రోకరో స్పష్టంగా తెలుస్తుంది. అవన్నీ పచ్చి అబద్ధాలు: – కేవీ రావు ఏడాదిలో ఏడెనిమిది నెలలు అమెరికాలో ఉంటాడు. సింగపూర్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా బ్రోకర్ పనులు చేయడం కేవీ రావు పని. అలాంటి వ్యక్తిని విక్రాంత్రెడ్డి బెదిరించాడని చెప్పడం పచ్చి అబద్ధం. – ఎలాగైనా కాకినాడ పోర్టును తన బినామీ కేవీ రావుకి పూర్తిగా అప్పగించాలనే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారు. – కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేయడం అనేది నిజంగా హాస్యాస్పదంగా ఉంది. పరువు నష్టం దావా వేస్తాను: – స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జైలుకెళ్లొచ్చిన క్రిమినల్ చంద్రబాబు. ఆయన క్రిమినల్ కాబట్టి అందర్నీ క్రిమినల్స్ మాదిరిగానే చూస్తున్నాడు. – తాను జైలుకెళ్లొచ్చిన కారణంగా వైయస్సార్‌సీపీ నేతలందరి మీద తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేయాలన్న లక్ష్యంగా.. వైఎస్ జగన్ సహా నా మీద కూడా కక్ష తీర్చుకోవాలని చంద్రబాబు పట్టుదలగా పని చేస్తున్నారు. – పార్లమెంట్ సమావేశాల్లో ఉంటున్న నాపై లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చింది?. నాపై 21 కేసులున్నాయి. నేను విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జ్ఞానం కూడా చంద్రబాబుకి లేకుండా పోయింది. – ఈ లుకౌట్ నోటీసులు ఇవ్వడం వెనుక చంద్రబాబుకి దురుద్దేశం ఉంది. – అందుకే వచ్చే వారం చంద్రబాబుతో పాటు, నాపై తప్పుడు కేసు పెట్టిన కేవీ రావుపై హైకోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నాను. చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు: – ఈ కేసులో మేం నిర్దోషులుగా బయటపడిన తర్వాత చంద్రబాబు తప్పుడు విధానాలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం. – చంద్రబాబు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి శూన్యం. కాబట్టే ప్రజలను మభ్య పెట్టడమే ధ్యేయంగా రోజూ ఏదో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. – ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మళ్లీ ఖచ్చితంగా మేం అధికారంలోకి వస్తామని ఆయన గుర్తుంచుకోవాలి. – చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న అన్యాయాలు, అరాచకాలకు, మేం అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబుకు కనీసం ఆ విషయం తెలియదా?: – ప్రాపర్టీ వాల్యూయేషన్ రకరకాలుగా ఉంటుంది. ఇది చంద్రబాబుకి అర్థం కాలేదని చెప్పడం కూడా అబద్ధమే. – 2020 మే నెలలో నేను కేవీ రావుకి ఫోన్ చేసి విక్రాంత్రెడ్డి వచ్చి కాకినాడ సీపోర్టు గురించి మాట్లాడతాడని చెప్పానని చంద్రబాబు ఆరోపిస్తున్నాడు. – అక్కౌంటింగ్ కంపెనీల్లో రెండూ నా నామినీలు అని మరో ఆరోపణ. ఇదంతా చూస్తుంటే, చంద్రబాబుకు కనీస జ్ఞానం లేనట్లు కనిపిస్తోంది. ఛార్టెడ్ అక్కౌంటింగ్ కంపెనీల్లో నామినీలు ఉండరు. బ్యాంకు అకౌంట్లకు మాత్రమే నామినీలు ఉంటారన్న విషయం చంద్రబాబుకు తెలియదా?. – చంద్రబాబు పాలనలో ప్రజలంతా అభద్రతా భావంలో బతుకుతున్నారు. చంద్రబాబు కబంధ హస్తాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి విముక్తి కావాలి. చంద్రబాబుకి పాలన చేత కాదు. తన కులం తప్ప ఆయనకు మరే ఇతర కులాలు కనిపించడం లేదు. – రాష్ట్ర అభివృద్ది కానీ, ప్రజల సంక్షేమం కానీ, చంద్రబాబుకి అస్సలు çపట్టడం లేదు. ఎంతసేపూ కక్షసాధింపు చర్యలు తప్ప, ఈ ఆరు నెలల్లో ఆయన రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదు. చంద్రబాబు, ఆయన కుమారుడి తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. – అందుకే రాష్ట్రానికి చంద్రబాబు అవసరం లేదని టీడీపీ నాయకులు ఇప్పటికైనా గుర్తించాలి. కూటమిలో అందరూ కలిసి మరొకరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి. కాబట్టి అందరూ ఈ విషయాన్ని ఆలోచించమని కోరుతున్నాను. సీబీఐతో విచారణ చేయించాలి: – గతంలోనే చంద్రబాబు 64 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశాడు. తన బినామీలకు కట్టబెట్టాడు. – అప్పట్లో మలేషియా ప్రధాని పోర్టును కొంటున్నాడని తెలిసి, దాన్ని చేజిక్కించుకునేందుకు కేవీ రావును సీఎండీ స్థానంలో కుర్చోబెట్టి పోర్టును దొచుకునేందుకు ఆరోజే చంద్రబాబు పోర్టుపై కన్నేశాడు. – ఆనాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలన్నింటిపై విచారణ చేయిస్తే చంద్రబాబు కార్యకలాపాలన్నీ బయటపడతాయి. – అయితే ఆ విచారణను చంద్రబాబు జేబు సంస్థలా పని చేస్తున్న సీఐడీ ద్వారా కాకుండా, సీబీఐ లేదా ఈడీతో ఆ విచారణ జరిపించాలని శ్రీ వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.