కేసులన్నీ నిరూపితమైతే బాబు జీవితాంతం జైలులోనే 

చంద్ర‌బాబుపై ఇంకా 6, 7 ట్రయిలబుల్‌ కేసులున్నాయి 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో  పదేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్‌ 

రామోజీ అక్రమాలపైనా చట్టపరిధిలోనే ధర్మాన్ని నెరవేరుస్తాం 

వైయ‌స్ఆర్ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు విజయసాయిరెడ్డి

ఒంగోలు: ఎన్ని అక్రమాలు చేసినా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోవచ్చని, స్టేలు తెచ్చుకుని శిక్ష నుంచి తప్పించుకోవచ్చని చంద్రబాబు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చాడ‌ని, కానీ నేటితో ఆ భ్రమలు వీడిపోయాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎవరైనా చట్టానికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే పాలన సాగించాల్సి ఉంటుందని కోర్టు తీర్పుతో నేడు మరోమారు నిరూపితమైందని చెప్పారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు­కు పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశముందని, ఆయనపై ఇంకా 6 లేదా 7 ట్రయిలబుల్‌ (ప్రా­సి­క్యూషన్‌ ) కేసులు ఉన్నాయ‌న్నారు. 

``రాష్ట్ర ఖజానాకు సంబంధించిన సంపదను దోచు­కుని, విదేశాలకు ఎలా తరలించారన్న దా­నిపై విచారించి తిరిగి ఖజానాకు జమచేసే­లా సీఎం జగన్‌ చర్య­లు చేపడతారు. నిజానికి.. బాబు అవినీతికి సంబంధించిన అన్ని కేసుల్లో శిక్షపడితే జీవితాంతం జైల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌తోపాటు తదుపరి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించ­డం ద్వారా ఇంకా అనేక అంశాలు బహిర్గతమవుతాయి.  

ఇక రామోజీరావు దారుణాలు, అకృత్యాలు కూడా చాలానే ఉన్నాయి. ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొన్నింటిలో తప్పించుకున్నారు. కానీ, అన్నింటిని చట్టపరిధిలోనే ధర్మాన్ని నెరవేరుస్తాం. ఉన్నత పదవుల్లో ఉన్నవారు రాష్ట్ర సంపదను దోచుకుని అవినీతికి పాల్పడినప్పుడు కేసు నమోదుచేస్తే అది రాజకీయ కక్ష అవుతుందా? నిజంగా రాజకీయ కక్షే అయితే ఆదివారం ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పువచ్చేది. ఒకసారి ఎఫ్‌ఐఆర్‌ నమోదై, అరెస్టయితే మిగిలిన వ్యవహారమంతా కోర్టు పరిధిలోకి వెళ్తుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రకారమే అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది`` అని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.

Back to Top