ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది

గ్యాస్‌ ప్రభావిత గ్రామాలను సేవ్‌ అండ్‌ గ్రీన్‌ జోన్‌గా మారుస్తాం

వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తాం

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, విశాఖ గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్‌ లీకేజీ ఘటన వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేయిస్తామని, గ్యాస్‌ ప్రభావిత గ్రామాలను పూర్తి సేఫ్‌.. గ్రీన్‌ జోన్‌గా తయారు చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న పశువుల కోసం 25 టన్నుల పశుగ్రాసం సరఫరా చేస్తున్నామని ప్రకటించారు.

ప్రజలకు మధ్యాహ్నం, సాయంత్రం భోజనంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ ప్రాంతమంతా మామూలు పరిస్థితికి వచ్చేంత వరకు బాధ్యత అంతా ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ గ్యాస్‌ ప్రభావిత గ్రామాల స్థితిగతులను నిరంతరం మానిటరింగ్‌ చేస్తున్నారని వివరించారు.
 

Back to Top