టీడీపీ గూండాలపై చ‌ర్య‌లు తీసుకోవాలి

మంత్రి జోగి రమేష్‌ 
 

కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ అరాచకం సృష్టించింది. టీడీపీ గూండాలు దాదాగిరికి పాల్పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు గుర్తించాయి. ప్రశ్నించినందుకు జోగి రమేష్‌ అనుచరుడు ఆరేపల్లి రాముపై కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నెల్లూరు: ఓటమి భయంతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అభ్యర్థి మేరీగా మురళిపై దాడికి యత్నించారు. సంగం మండలం చెన్నవరప్పాడులో  వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్త ఢిల్లీ బాబు గాయపడ్డారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, ముసునూరులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.

Back to Top