మేం తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ

బీజేపీతో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో స్పష్టం చేయాలి

బీజేపీలో ఉంటూ టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న సుజన

ఏపీలో ఐదు నెలలుగా జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా

చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డప్ప

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుందని చిత్తూరు ఎంపీ ఎన్‌.రెడ్డప్ప హెచ్చరించారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న సుజనాచౌదరి వ్యాఖ్యలను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఢిల్లీలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రెడ్డప్ప మాట్లాడుతూ.. ఎన్నికల్లో మేం ఎవరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. మాపై గౌరవంతో పెద్ద పెద్ద కొమ్ములు తీరిన వారిని ఓడించేందుకు వైయస్‌ జగన్‌ మాకు టికెట్లు ఇచ్చారన్నారు. ప్రజలందరూ మమ్మల్ని గెలిపించుకున్నారన్నారు. కొంత మంది ఎంపీలు టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి పేర్కొనడం సరికాదన్నారు. నీతో ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలని డిమాండు చేశారు. నీతి, నిజాయితీకి వైయస్‌ జగన్‌ మారుపేరు అన్నారు. ఆయన అడుగు జాడల్లో మేమంతా నడుస్తున్నామని స్పష్టం చేశారు. మా కొన ఊపిరి ఉండేవరకు ఆయన వెంటే ఉంటామన్నారు. వైయస్‌ జగన్‌ తలుపులు తెరిస్తే..టీడీపీ నేతలంతా వైయస్‌ఆర్‌సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ రోజు చంద్రబాబు మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఈ రోజు వైయస్‌ జగన్‌ అరగంటలో అందరిని పార్టీలో చేర్చుకోగలరన్నారు. అంతనీచమైన పరిపాలన వైయస్‌ జగన్‌ చేయరన్నారు. ఆగమేఘాలపై సుజనా చౌదరి బీజేపీలో చేరారన్నారు. కొన్ని పత్రికలు అవాస్తవాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే పరిస్థితి ఉందన్నారు. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 22 మంది ఎంపీలను ఒక్కతాటిపై నడుపుతున్నారన్నారు.  అన్ని అవకాశాలు మాకు కల్పిస్తున్నారని చెప్పారు. మీలాగా దోపిడీలు చేయలేదన్నారు. సున్నపు బట్టీలు అమ్ముకొని ఓ ఎమ్మెల్యే జైలుకు వెళ్లారని, ఇసుక అమ్ముకొని మరో ఎమ్మెల్యే జైలుకు వెళ్లారని, రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన కుమారుడు దోచుకున్నారని పేర్కొన్నారు. సుజనా చౌదరి రూ.6 వేల కోట్లు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి ఈ రోజు నీతులు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎండోమెంట్‌ నిధులు మళ్లించి వేరే కార్యక్రమాలకు పెడుతున్నారని ఆరోపించడం తప్పు అన్నారు. ఎండోమెంట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు పసుపు-కుంకుమ కార్యక్రమానికి మళ్లించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు సొంత పని మీదనే సుజనా చౌదరి బీజేపీలో చేరారని విమర్శించారు. ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 
పల్లెల్లో ఆంధ్రజ్యోతి సర్య్కూలేషన్‌ తగ్గిపోవడంతో మాపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌పై అవాస్తవాలు రాయడం సరికాదన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు మాత్రమే అయ్యిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలు వైయస్‌ జగన్‌ అమలు చేశారన్నారు. రైతులు, ఆటో డ్రైవర్లకు, ఆగ్రి గోల్డ్‌ బాధితులకు డబ్బులు ఇస్తే మీకు కనిపించడం లేదా అన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న వైయస్‌ జగన్‌ను పొగడకపోయినా ఫర్వాలేదని, అవాస్తవాలు చెప్పడం దుర్మార్గమన్నారు.
అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టిన వైయస్‌ జగన్‌కు అందరం రుణపడి ఉంటామన్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు సక్రమంగా చదువుకునేందుకు వీలుగా ఈ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు.ఇంగ్లీష్‌ మీడియంపై రాద్ధాంతం చేయడం దారుణమన్నారు. మీ పిల్లలేనా ఇంగ్లీష్‌ మీడియం చదివేదని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవంలో చంద్రబాబు సాధించింది ఏంటని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అమరావతిలో ఒక్కటైనా ఫర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టారా అని నిలదీశారు. సుజనా చౌదరి ఈ విషయంపై చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బీజేపీలో ఉంటూ సుజనా చౌదరి టీడీపీ ఏజెంట్‌గా పని చేస్తున్నారని దుయ్యబట్టారు. బడికి వెళ్లే వారంతా కూడా గుడికి వెళ్తారని, హద్దుమీరి ప్రవర్తిస్తే మంచిది కాదన్నారు. మాకు 151 సీట్లు వచ్చాయంటే సామాన్య విషయం కాదన్నారు.  

Read Also : త్వరలో రచ్చబండ కార్యక్రమం

తాజా ఫోటోలు

Back to Top