వీధి రౌడీకి.. పవన్‌ కల్యాణ్‌కి తేడా ఏముంది..?

నన్ను ఎంపీగా రాజీనామా చేయమనడానికి నువ్వెవడివి..? 

వార్డు మెంబర్‌ కూడా కాని నువ్వు నన్ను విమర్శించడమా..?

విశాఖపై ప్రేముంటే పరిపాలన రాజధానికి మద్దతు ప్రకటించు

మేం బిల్డర్స్‌మే కానీ.. కబ్జాకోరులం కాదు

టీడీపీవాళ్లు చేసిన కబ్జాలపై ఏనాడైనా ప్రశ్నించావా..?.

ప‌వ‌న్‌కు మంగళగిరిలో రూ.50 కోట్ల భూమి రూ.20 లక్షలకు ఎలా వచ్చింది..?

భర్తగా, ఫాదర్‌గా పవన్‌ ఫెయిల్యూర్‌.. రాజకీయాల్లోనూ పెద్ద ఫెయిల్యూర్‌

సీఎం వైయ‌స్ జగన్‌ కాలిగోటికి కూడా ప‌వ‌న్ స‌రిపోడు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌

విశాఖ‌: పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ అన్నారు. సిరిపురం జంక్షన్‌ వద్ద పవన్‌ కల్యాణ్‌ మీడియా ముందు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. గాజువాకలో ఓడిపోయిన పవన్ కల్యాణ్ తనకు తానుగా స్టేట్ రౌడీగా ఊహించుకుని ఫోజులిస్తున్నాడని, ఒక రౌడీకి ఉండాల్సిన లక్షణాలన్నీ ప‌వన్‌ దగ్గరున్నాయ్‌.. ఒక వీధి రౌడీకి పవన్‌ కల్యాణ్‌కి తేడా ఏముంది..? అని ప్ర‌శ్నించారు. రెండు నెలల క్రితం త‌న‌ కుటుంబ కిడ్నాప్‌ వ్యవహారంలో గురించి చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమ‌న్నారు. దాని వెనుక ఎవరూ లేరు.. కేవలం డబ్బు కోసం రౌడీషీటర్‌ చేసిన వ్యవహారం అని కూడా చెప్పానని గుర్తుచేశారు. పోలీసులు సకాలంలో స్పందించి ఎవరికి ప్రాణనష్టం లేకుండా మంచి డ్యూటీ చేశారని కూడా చెప్పానన్నారు. విశాఖ‌లో ఎంపీ స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే..

18వేల గజాలు స్థలం అన్యాక్రాంతం అయ్యిందనే ఆరోపణ చేశాడు. ఆ స్థలం పూర్తిగా ప్రైవేటు స్థలం. అన్నీ పరిశీలించిన తర్వాత మా సంస్థ తీసుకుని 24 ఫ్లోర్ల బిల్డింగ్‌ కట్టడానికి వర్క్‌ స్టార్ట్‌ చేశాం. 
సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన స్థలం 75/4 సర్వే నంబర్‌లో ఉంది. దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని పవన్‌ విమర్శించడాన్ని కూడా ఖండిస్తున్నా. సాంఘిక సంక్షేమ శాఖ స్థలం 75/4 అయితే మేం డెవలెప్‌ చేస్తున్న 75/ 3. రెండు వేర్వేరు.

పరిపాలన రాజధానికి మద్దతు ప్రకటించు
ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరాన్ని నాశనం చేస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేస్తున్నాడు. మీకు విశాఖపై ప్రేమ ఉంటే విశాఖ పరిపాలన రాజధానికి మద్దతు పలుకుతున్నానని ప్రకటించండి. ఎందుకు ఒక్క రోజు కూడా ఈ విషయం మాట్లాడటం లేదు..? రుషికొండలో అభివృద్ధిని అడ్డుకోడానికి వెళ్లి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి అంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఎన్నో నిర్మాణాలు జరుగుతున్నాయి..ఎన్నో కొండలను చదును చేసి అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. ఇతనకి విశాఖ మాస్టర్‌ ప్లాన్‌ అంటే ఏంటో, విఎంఆర్డీ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ అన్నీ తెలుసుకుని మాట్లాడతాను అని మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. 2022లో విశాఖ విఆర్డీఎం మాస్టర్‌ ప్లాన్‌ వచ్చింది. 2047 వరకూ అమల్లో ఉంటుంది. 2022 నుంచి 2047 వరకూ మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తారు. ఈ లోపు ఎవరన్నా బిల్డింగ్‌ పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేస్తే భవిష్యత్తులో రోడ్లు వేసినప్పుడు ఆ భవనాలు అడ్డురాకుండా ఉండటానికి ఆ రోడ్డులో ఎంతైతే వారి స్థలం పోతుందో దానికి సరిపడా గిఫ్ట్‌డీడ్‌ తీసుకుని టీడీఆర్‌ ఇస్తారు. అదికూడా తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తాను అంటాడు. 

నన్ను ప్రజలు గెలిపించారు. వైయ‌స్ జగన్‌ని చూసి, స్థానికంగా నా మంచితనం చూసి నన్ను ఎంపీగా చేశారు. నేను 2019 నుంచి ఈరోజు వరకూ ఇదే ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. 
గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఏ ఒక్కరితోనైనా మాట్లాడావా..? ఏ ఒక్కరోజైనా నియోజకవర్గానికి వచ్చిన ప్రజలతో కష్టాలు తెలుసుకున్నావా..? నువ్వు బీజేపీ మద్దతు తెలియజేస్తూ విశాఖ స్టీల్‌ ప్లాంటు గురించి ఎందుకు మాట్లాడటంలేదో నాకు కారణం చెప్పు. నేను విశాఖ వదిలి పారిపోతాను అని ఏ రోజూ చెప్పలేదు...దాన్ని వక్రీకరించి నేను పారిపోతున్నాను అంటున్నాడు. నన్ను ఎంపీగా రాజీనామా చేయమనడానికి నువ్వెవడు..? నాకేమన్నా ఓటేశావా..? నాకు మద్దతు తెలియజేశావా..? నువ్వెవడు రాజీనామా చేయమనడానికి..? ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయ్‌.. దమ్ముంటే రా నాగిరెడ్డిపై పోటీ చెయ్‌.. లేదా నా మీద ఎంపీగా పోటీ చేయ్‌..దమ్ముంటే రా.. రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడిపోయిన వాడివి నువ్వు కబుర్లు చెప్తున్నావ్‌. అసలు నీకు మళ్లీ విశాఖ రావడానికి సిగ్గు లేదా..? మా రియల్‌ హీరో నాగిరెడ్డి. ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకూ గాజువాకలో మీరు కనిపించలేదు. కరోనా సమయంలో సైతం హైదరాబాద్‌లో ప్యాలెస్‌లో కూర్చున్న వాడివి. నీకు కనీసం ఏపీలో, విశాఖలో సొంత ఇళ్లు లేదు నువ్వు కూడా మాట్లాడుతున్నావ్‌. 

ఎందరికో ఉపాధి చూపించా
అవును నేను 25 ఏళ్ల నుంచి వ్యాపారాలు చేస్తున్నాను. నీకేంటి ఇబ్బంది..? ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాను..ఎంతో పన్నులు రాష్ట్రానికి, కేంద్రానికి కడుతున్నాను. వందకు పైగా విశాఖలో నిర్మాణాలు చేపడుతున్నాను. కొన్ని వేల కుటుంబాలు నాపై ఆధారపడి బతుకున్నాయి. విశాఖ అభివృద్ధిలో మాదీ ఒక పాత్ర ఉంది. ఒక ఆరోపణ మాపై లేదు. నువ్వు రాజకీయంగా ఏదో చేస్తానంటున్నావ్‌...మరి సినిమాలు ఎందుకు తీస్తున్నావ్‌..? కోతిలా ఎందుకు గెంతుతున్నావ్‌...ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నావ్‌..? అంటే నువ్వు చేసేది వ్యాపారం కాదా..? మేం బిజినెస్‌ చేయకూడదు..పది మంది ఉపాధి ఇవ్వకూడదా..? నువ్వు మాత్రం సినిమాల్లో గెంతొచ్చు...డబ్బులు తీసుకోవచ్చా..? నష్టం వచ్చిన వారి డబ్బులు కూడా తిరిగి ఇవ్వడు..మొన్న బ్రో సినిమా వచ్చింది..30 శాతానికి పైగా డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వచ్చింది...దమ్ముంటే వారి డబ్బు వారికి ఇచ్చేయ్‌..

టీడీపీ మోచేతి నీళ్లు తాగే నువ్వే అసమర్ధుడివి
నేను అసమర్ధుడను కాదు...నీకు దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చెయ్‌.. ఎందుకు టీడీపీ వెనుక వారి మోచేతి నీళ్లు తాగుతున్నావు..? వాళ్లిచ్చే 25–30 సీట్ల కోసం దేబిరించి కాపు కులస్థల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతున్నావు. నీ పబ్బం గడుపుకోవడానికి నువ్వు చంద్రబాబు బూట్లు నాకుతున్నావ్‌.. నీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉందా..? ముఖ్యమంత్రి  ఏమీ చేయడం లేదంటున్నావు..అసలు నువ్వేం చేద్దామనుకుంటున్నావో చెప్పు. అసలు నీకు మేనిఫెస్టో ఏదీ..? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు రాష్ట్రానికి..? విశాఖను ఏం చేయాలనుకుంటున్నావు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నావు..? వాలంటీర్‌ వ్యవస్థను కంటిన్యూ చేద్దామనుకుంటున్నావా లేదా..? సీఎం వైయ‌స్ జగన్‌ సంక్షేమ పథకాలు నువ్వు కంటిన్యూ చేద్దామనుకుంటున్నావా లేదా..? ఇవన్నీ దమ్ముంటే ధైర్యంగా చెప్పు. నీ మాటల్లో ఆవేశం, ఆరుపులు, యాక్టింగ్‌ రియల్‌గా పోటీ చూపించు.. 175 స్థానాల్లో పోటీ చేసి నీ ఆవేశం, హీరోయిజం చూపించు. నువ్వు ఒక పిరికిపందవు..ఒంటరిగా పోటీ చేయలేవు. చంద్రబాబు సపోర్టు కావాలి..తెల్లారితే అతని బూట్లు నాకాలి.. దానికి నువ్వు హీరోయిజంతో మాటలు మాట్లాడుతున్నావు. 

ఆ భూమి రూ.20 లక్షలకు ఎలా కొట్టేశావ్‌..?
2008లో విశాఖలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని చీటింగ్‌ చేశావని కేసు ఫైల్‌ అయింది. మళ్లీ రెండో పెళ్లి కోసం ఆ అమ్మాయికి సెటిల్‌ చేసి రెండో పెళ్లి చేసుకున్నావు. నీకు రెండో పెళ్లి, మూడో పెళ్లిలో పిల్లలు పుట్టారు..వాళ్లెక్కడున్నారో తెలియదు.. కనీసం తండ్రి ప్రేమ, అప్యాయత, భర్త తాలూకు ఆప్యాయత ఏదీ వారికి చూపించవు. నువ్వా నాకు చెప్పేది...అసలు నువ్వు ఒక మనిషివేనా..? మంగళగిరి కాజా టోల్‌ గేట్‌ వద్ద లింగమనేని వద్ద 5 ఎకరాలు 20 లక్షలకు కొనేశావ్‌. అక్కడ ఎకరా పదికోట్లు ఉంది. 50 కోట్ల ఆస్తిని 20 లక్షలకు కొనేశావ్‌. చంద్రబాబు దగ్గరుండి ప్యాకేజీలో భాగంగా దాన్ని ఇప్పించాడు. ఇది అవినీతి కాదు..మేం టాక్సులు కడుతూ వ్యాపారం చేస్తుంటే అది మాత్రం అవినీతా..? 

2024లో అసలు మీలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి..?
151 స్థానాలు గెలుచుకుని ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నసీఎం వైయ‌స్‌ జగన్‌పై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నావు. ఇక్కడ కొచ్చి సినిమాలు యాక్టింగులు చేయడం కాదు. అసలు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో తెలుసా నీకు..? 2024లో చంద్రబాబును నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించమను.. నువ్వు ముఖ్యమంత్రి అవుతావో లేదో నీకు తెలియదు.. 2024 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ముందు చెప్పండి..? 175 స్థానాల్లో నువ్వెన్ని..వాళ్లెన్ని పోటీ చేస్తారో ముందు చెప్పండి. నువ్వేమన్నా మనిషివా దున్నపోతువా..? సినిమాల్లో గంతులేసినంత మాత్రాన రాష్ట్రానికి నాయకులైపోరు. గతంలో ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్‌లు పార్టీలు పెట్టారు..కానీ ఎవడి మోచేతి కింద నీళ్లు తాగలేదు.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొట్టి వాళ్లకి ఇంట్లో ఖర్చులకు దాచుకున్న డబ్బులతో నీకోసం జెండాలు కట్టుకుని తిరగాలా..? నువ్వు సినిమాల్లోకి వచ్చిందే మీ అన్నను అడ్డుపెట్టుకుని..సినిమాల్లో నీకు ఇండివిడ్యువాలిటీ లేదు.

పవన్‌ ఒక ఫెయిల్యూర్‌ పీస్‌
ఒక భర్తగా ఫెయిల్యూర్‌. ఒక ఫాదర్‌గా పవన్‌ కల్యాణ్‌ ఫెయిల్యూర్‌. రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోటా గెలవలేక రాజకీయాల్లోనూ ఫెయిల్యూర్‌. విశాఖ స్టీల్‌ ప్లాంటును బీజేపీ ప్రైవేటీకరిస్తే వారితో కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశావ్‌. మోడీ, అమిత్‌షాకి చెప్పి వైయ‌స్‌ జగన్‌ని జైళ్లో పెట్టిస్తాడట. అంత క్లోజ్‌ అయితే విశాఖ స్టీల్‌ ఒక మాట చెప్పి ఆపించొచ్చు కదా..? ఆ పార్టీని కూడా నడపలేక..వారాహిపై సినిమా ఫోజులిచ్చి పార్టీని కూడా తాకట్టుపెట్టేశాడు. అసలు ముందు నీ కులానికి ఏం చేస్తావో చెప్పు మందు. నీకంటే కేఏ పాల్‌ వెయ్యి రెట్లు బెటర్‌..ఆయన అన్ని స్థానాల్లో పోటీ చేస్తానంటున్నాడు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడివి..ఎంపీగా గెలిచిన నా గురించి మాట్లాడతావా..? 

వైయ‌స్ జగన్‌ కాలిగోటికి కూడా సరితూగవు పవన్ 
సీఎం వైయ‌స్ జగన్‌ ఒక గొప్ప వ్యక్తి. వైయ‌స్‌ జగన్‌ కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు. 2024 తర్వాత చూడు..నువ్వు అడ్రస్‌ కూడా ఉండవు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకోవాలంటే నీకంటే చెత్త వ్యక్తిగత జీవితం ఎవరికీ ఉండదు. కనీసం విలువలు లేని వ్యక్తిగత జీవితం నువ్వు గడిపావు. పెళ్లి చేసుకున్నా పెళ్లాలు..పిల్లలు నీతో లేరు. ప్రొడ్యూసర్ల డబ్బులు తీసుకుని డేట్లు ఇవ్వవు. తలుపులు తీయవు..ప్రొడ్యూసర్ల నీ ఇంటిముందు పడిగాపులు కాయాలి. నీ కోసం వాళ్లంతా ఆస్తులు అమ్ముకుని రోడ్డు మీద పడితే వారికి సమాధానం చెప్పవు. నీ కార్యకర్తలు, నాయకుల సమస్యలనే తెలుసుకోలేని వాడివి రేపు రాష్ట్రానికి ప్రజల సమస్యలపై ఏం చేస్తావు. అసలు నిన్నెవడయ్యా రాజకీయ నాయకుడు అన్నది. ఎవడు నిన్ను రాజకీయాల్లోకి రమ్మని చెప్పింది. రాజకీయ నాయకుడి లక్షణం ఒకటైనా నీ దగ్గర ఉందా..? అసలు నీకు విశాఖ వచ్చి ఇక్కడి నుంచి మాట్లాడే హక్కు ఎక్కడుంది. విశాఖలో మోసంతో నీ జీవితం ప్రారంభించావు..వెన్నుపోటుతో ప్రారంభించావ్‌. 2008లో నీపై కేసు నమోదైందా లేదా..? నువ్వొక మనిషివి...నీకు ఆదర్శాలు ఉన్నాయంటే మేం వినాలి.. చూసుకుందాం..2024 ఎన్నికల్లో నీ కెపాసిటీ ఏంటో..? గాజువాకలో ఓడిపోయిన పవన్ కల్యాణ్ తనకు తానుగా స్టేట్ రౌడీగా ఊహించుకుని ఫోజులిస్తున్నాడు. ఒక రౌడీకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇతని దగ్గరున్నాయ్‌. ఒక వీధి రౌడీకి పవన్‌ కల్యాణ్‌కి తేడా ఏముంది..? 

Back to Top