సీఎం పర్యటన నేపథ్యంలో కుప్పంలో పండుగ వాతావరణం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ భరత్‌

కుప్పం: సీఎం వైయస్‌ జగన్‌ కుప్పం పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ భరత్‌ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను చూసేందుకు, ప్రసంగం వినేందుకు కుప్పం ప్రజలంతా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారన్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన జోష్‌ పార్టీ కేడర్‌లోనే కాదు.. ప్రజలందరిలోనూ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్సీ భరత్‌ మీడియాతో మాట్లాడారు. ‘పులివెందుల ఎంతో.. నాకు కుప్పం కూడా అంతే’ అని సీఎం చెప్పినరోజు నుంచి అనూహ్యమైన మార్పు వచ్చిందన్నారు. ప్రజలంతా ఒక మార్పు కావాలని బలంగా నిర్ణయించుకున్నారని, కుప్పం ప్రజలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒక బలమైన స్టేట్‌మెంట్‌ ఇవ్వబోతున్నారన్నారు. కుప్పంలో 22న జరగబోయే సీఎం వైయస్‌ జగన్‌ సభ దానికి అద్ధం పడుతుందన్నారు. కుప్పంను మున్సిపాలిటీగా మార్చడమే కాకుండా.. అడిగిన వెంటనే రూ.66 కోట్ల నిధులను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. వాటికి సంబంధించి పనులకు శంకుస్థాపన చేయడానికి సీఎం కుప్పం వస్తున్నారు. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు అని ఎమ్మెల్సీ భరత్‌ చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top