అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం!

వైయ‌స్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్ 

కూటమిలో మిగతా పార్టీల తరఫున పోటీ చేస్తున్నదీ చంద్రబాబు మనుషులే!

అడవికి రాజు సింహం..ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్‌ గారే.

పోటీ చేసిన రెండుచోట్లా కాళ్ళు, కీళ్ళు విరగ్గొట్టినా బుద్ధి రాలేదా పవన్ కల్యాణ్?

చిరంజీవిని అవమానించిందీ, తల్లిని అవమానించిన వారి పంచన చేరిందీ పవన్ కల్యాణే!

పవన్ ఆస్తులు మాయే, పెళ్ళాల లెక్కలు మాయే!

పవన్‌ ఎన్నికల అఫడవిట్‌లో అడుగుకో అబద్ధం

సినిమాల్లో కంటే.. జనసేన పెట్టాకే పవన్ ఆస్తులు ఎలా పెరిగాయ్?

పోతిన మహేష్‌

 తాడేప‌ల్లి:  టీడీపీ, బీజేపీ, జన‌సేన‌ల‌ది కూట‌మి కాదు..  "కుమ్మక్కు" రాజకీయమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్ అభివ‌ర్ణించారు. బుధ‌వారం  పోతిన మహేష్‌ మీడియాతో మాట్లాడారు.

*కూటమి కాదు.. కుమ్మక్కు రాజకీయం:*
– జరగబోయే ఎన్నికల్లో, జగన్‌ గారు ఒక్కరే ఒక వైపున ఉంటే... టీడీపీ, జనసేన, బీజేపీ అన్నీ కలిసి మరో పక్క ఉన్నాయి. కూటమి పేరుతో వీరంతా కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు. అదే వ్యక్తులు.. పార్టీలే మారతాయి. చంద్రబాబు మనుషులంతా కూటమి పార్టీల్లో టికెట్లు తెచ్చుకుని, వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తారు.  అందుకే వీళ్ళ కూటమి రాజకీయాన్ని కుమ్మక్కు రాజకీయం అని ప్రజలంటున్నారు.
– జనసేన, బీజేపీ అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులోనుంచే అనేది స్పష్టంగా తెలుస్తోంది.  
– మరి ఈ గుంపును హైనాలు, గుంటనక్కలు, తోడేళ్లు అనక ఇంకేమనాలి? 
– వాళ్లు ప్రజల కోసం జత కట్టలేదు. ఎంతమంది కలిసైనా అధికారంలోకి వచ్చి,  ప్రజల ఆస్తులను దోచుకునేందుకు, పేదల నోట్లో మట్టికొట్టేందుకు, భూములు కొట్టేసి లక్షల కోట్లు సంపాదించాలని జతకట్టారు. 
– చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఎలా ఉంటాయంటే...  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చాలా కాలం సోషల్ మీడియాలో కొండంత రాగం తీశారు. 
– తీరా చూస్తే 24 సీట్లల్లో పోటీ చేస్తున్నానని చెప్పాడు, ఆ తర్వాత 21 సీట్లు తీసుకుని సర్దుకున్నాడు. చివరికి నిజమైన జనసేన కార్యకర్తలకు దక్కింది 11 సీట్లే. 
– ఓటమి భయంతోనే పవన్‌ కల్యాణ్‌ ఇష్టానుసారం ప్రేలాపనలు పేలుతున్నాడు. 
– తన పరిస్థితి ఏంటో అర్ధం కాక తనను అభిమానించే కాపుల్ని, కార్యకర్తలను కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు.
– అదే జగన్‌ గారు ప్రజల్ని నమ్ముకున్నారు.. ప్రజలు జగన్‌ గారిని నమ్మారు.
– అందుకే జగన్‌ గారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి గారు.
– ఆయన ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు కాబట్టే ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. 
– ఈ ఎన్నికల్లో జగన్‌ గారు కచ్చితంగా గెలిచి రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
– అడవికి రాజు సింహం..ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్‌ గారే.
– అందుకే సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నాం. 

*చిత్త కార్తె కుక్కలకే వావివరసలు ఉండవు:*
– చంద్రబాబు వద్ద కుక్కలా పడి ఉండటం వల్ల పవన్‌ కల్యాణ్‌కు కుక్క బుద్ధులు బాగా వచ్చినట్లున్నాయి. 
– అందుకే ఆయన చంద్రబాబుకు విశ్వాసం చూపుతూ ఇతరులపై ఇష్టానుసారం మొరుగుతున్నాడు. 
– కుక్కలకైనా నీతి ఉంటుందేమో కానీ పవన్‌ కల్యాణ్‌కు నీతి ఎక్కడా లేదు. 
– ఇవన్నీ చిత్తకార్తె కుక్కలు. ఆ సమయంలో వాటికి వావీ వరసలు ఉండవు. ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్తాయి. 
– జగన్‌ గారి వెంట రాష్ట్ర ప్రజలుంటే..చంద్రబాబు వెంట హైనాలు, తోడేళ్లు, చిత్తకార్తె కుక్కలు ఉన్నాయన్నది ప్రజలకు తెలుసు. 
– పవన్‌ కల్యాణ్‌ అన్ని విధాల దిగజారిపోయాడు. వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయాడు. పార్టీలో దిగజారిపోయాడు. 
– పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళ వద్ద తాకట్టు పెట్టి కాపుల్లోనూ మరింతగా దిగజారాడు.

*పవన్ ఆస్తులు మాయే, పెళ్ళాల లెక్కలు మాయే!:*
– ఈ మధ్య మూడు- నాలుగు పెళ్లాలు అంటేనే పవన్ కల్యాణ్ బాగా గింజుకుంటున్నాడు.
– మరి వాలంటీర్లను ఆయన హ్యూమన్‌ ట్రాఫికర్స్‌ అంటే వారికి కోపం రాదా? 
– నువ్వు ఎన్నికల అఫడవిట్‌లో ఆదాయం, ఆస్తులపై మాయ చేస్తున్నట్లు పెళ్లాలు, గొళ్లేలు విషయంలోనూ మాయచేసున్నాడు. 
– మీరు ఏ భార్యతో ఎంతకాలం ఉంది. ఒక భార్యతో సంసారం చేస్తూ, మరొకరితో పిల్లలను కన్నది, ఇప్పుడు ఎవరితో ఉంటున్నది... వీటన్నింటిపై పవన్ కల్యాణే స్పష్టత ఇస్తే బాగుంటుంది. రాజకీయ నాయకుడంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. నా ఇష్టానుసారం చేస్తానంటే సమాజం హర్షించదు. 
– ఎవరైనా గుట్టుగా కాపురం చేసుకుంటారు. కానీ మీరే ఇంట్లో భార్యను పెట్టుకుని, మరో మహిళతో సంసారం చేసి, కడుపు చేశారని నీతో కాపురం చేసిన మహిళే బయటకు వచ్చి టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. 
– ఆ విషయంపై మీరు ఎందుకు స్పందిచలేదు? భర్తగా నువ్వు కలంకం తెచ్చావనేగా కదా ఆమె మాట్లాడింది. 
– ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత విమర్శలు చేసిందెవరు..? నీతో కాపురం చేసిన వ్యక్తులు కాదా?. స్వయంగా మీతో కాపురం చేసిన రేణు దేశాయ్‌ గారే కదా చెప్పింది.
– నా ఇష్టం.. నేను ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకుంటా, ఎంతమందినైనా వదిలేస్తా.. ఎంతమందికైనా కడుపులు చేస్తా.. అంటే సమాజం హర్షించదు. 
– ఇదే మాట ముఖ్యమంత్రి జగన్‌ గారు అంటే ఆయన్ను పట్టుకుని మదమెక్కి  పెళ్లాం అని మాట్లాడుతున్నారు. 
– మహిళలు అంటే పవన్‌ కల్యాణ్‌ కు ఎంత గౌరవమో ఆయన మాటలను బట్టే తెలుస్తుంది.  ఆడవాళ్లంటే అంగడి సరుకుగా చూసే నీలాంటి వాళ్లకు వారిని గౌరవించడం ఎప్పటికీ తెలియదు. 

*చిరంజీవి గారిని పదేపదే అవమానిస్తున్నది పవన్‌ కల్యాణే:*
– అసలు చిరంజీవి గారిని పదే పదే అవమానించేది పవన్‌ కల్యాణ్‌ కాదా? 
– కానిస్టేబుల్‌ కొడుకునంటాడు గానీ, చిరంజీవి సినిమా భిక్ష పెట్టడం వల్లే, పవర్‌ స్టార్‌ అయ్యానని ఎక్కడా చెప్పడు. ఈయన చిరంజీవిని అవమానించారు అంటాడు. చిరంజీవిని, వారి తల్లిని అవమానించిన పార్టీతో జత కట్టింది ఎవరు?
– తన తల్లిని అవమానించిన లోకేశ్, చంద్రబాబులతో పొత్తు పెట్టుకుని తన తల్లినే ఈరోజు పవన్ కల్యాణ్ అవమానించాడు.
– ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌కు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు ఆవిధంగా చెప్పబోతున్నారు. 

*పోటీ చేసిన రెండుచోట్లా కాళ్ళు, కీళ్ళు విరగ్గొట్టినా బుద్ధి రాలేదా?:*
– పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తూ,  మీరు ముందు నాకు ఓటేయండి.. ఆ తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటాడు.  ప్లీజ్‌ నన్నొక్కడ్నన్నా గెలిపించండి..ప్లీజ్‌ అంటూ అడుక్కునే నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడివా? 
– నువ్వు జనసేన అధ్యక్షుడివేనా లేక చంద్రబాబు తరఫున డమ్మీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావా? 
– నీలాంటి వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాలకు అర్హులు కారు. 
– పదే పదే ఆయన కాళ్లు, కీళ్లు ఇరగ్గొట్టి కింద కూర్చోబెడతానంటాడు.  నిన్ను 2019లోనే ప్రజలు కాళ్లూ కీళ్లు విరగ్గొట్టి రెండు చోట్ల కింద కూర్చోబెట్టారు. కాళ్ళు, కీళ్ళూ విరగ్గొట్టడానికి, ఒక్క దెబ్బకు వంద మంది కూలిపోవడం ఇలాంటివన్నీ.. సినిమాల్లోనే కనిపిస్తాయి. ఇంకా సినిమా జీవితంలోనే ఉన్నాననుకుంటున్నావ్‌..కాస్త బయటకు రా పవన్ కల్యాణ్. 
– ఎంతసేపటికీ, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ మాట్లాడటం కాదు..నీకు కూడా బుద్ధి, బుర్ర ఉండాలి కదా...
– ప్రజాస్వామ్యంలో కాళ్లూ విరిచేస్తా అంటే ప్రజలే అన్నీ విరిచి కూర్చోబెడతారు. 
– ఈయన పేరుకే సినిమాల్లో పవర్‌ స్టార్‌. రాజకీయాల్లో పవర్‌ లేదు. 
– ఆత్మ విశ్వాసం లేక, గెలుస్తామనే నమ్మకం లేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 
– వీళ్లంతా పిచ్చికుక్కల గుంపులా తయారై మాట్లాడుతున్నారు. 
– ప్రజల చేతిలో ఈ కూటమికి చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరిస్తున్నాను. 
– రాబోయే ఎన్నికల్లో కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోతుంది..మరోసారి జగన్‌ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 
– అందుకే వీళ్లు ఫ్రస్టేషన్‌తో వీళ్లు పిచ్చెక్కి ఊగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నారు. 
– ఈ రాష్ట్రం నుంచి ఈ పిచ్చి కుక్కలను తరిమేయకపోతే ఈ రాష్ట్రానికే ప్రమాదం. 
– పేద బడుగు బలహీనవర్గాలకు ఈ పిచ్చి కుక్కలతో ప్రమాదం పొంచి ఉంది. 
– కాపు సామాజికవర్గం చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లను పల్లకిలో మోయాలనుకుంటే..వాళ్లు చంద్రబాబు పల్లకి మోయమని చెప్తున్నారు. 

*స్వయం ప్రకాశం లేనివ్యక్తి పవన్:*
– పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి స్వయంగా ప్రకాశించలేడు. ఎవరివో ఒకరి కిరణాలు ఈయనపై పడితేనే వెలుగులు వస్తాయి. 
– ఈయన ఎప్పుడూ ఉపగ్రహమే. పిఠాపురంలో వర్మ వెలుగులు ఈయనపై పడాలి..అప్పుడే ఈయన కనిపిస్తాడు. 
– పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తి ఉపద్రవమే. ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే జగన్‌ గారు చెప్పినట్లు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలిపించాలి.
– చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని హోల్‌సేల్‌గా అమ్మేశాడు. పవన్‌ కల్యాణ్‌ జనసేనను రిటైల్‌గా అమ్ముతున్నాడు.
– ఈ విషయాన్ని కాపు యువత, సోదరులు గమనించాల్సిన అవసరం ఉంది. 

*పవన్‌ ఎన్నికల అఫడవిట్‌లో అడుగుకో అబద్ధం:*
– పవన్ కల్యాణ్... ఎన్నికల అఫడవిట్‌లో అన్నీ అబద్ధాలే నింపాడు. ఆయన అఫడవిట్‌ను విచారణ చేయించాలి. 
– ఐదేళ్ల ఆయన సంపాదన రూ.114.76 కోట్లు అయితే, అందులో 73 కోట్లు ట్యాక్సులే కడితే, పార్టీ వ్యవరాహాలకు సంబంధించి మరో 20 కోట్లు డొనేషన్స్ ఇస్తే, ఇంకా  రూ.90 కోట్ల ఆస్తులు ఎలా కొన్నాడు?
– ఆయన ప్రకటించిన ఆస్తులన్నీ జనసేన పార్టీ పెట్టిన తర్వాత కొన్నవే.
– రూ.90 కోట్ల ఆస్తులు 2018–2024 మధ్యలో కొన్నాడు. 
– రిజిస్టర్‌ విలువ ప్రకారం రూ.90 కోట్లు అయితే..  వాస్తవానికి ఆ ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.350 కోట్లు నుంచి రూ.400 కోట్లు ఉంటాయి. కరోనా సమయంలో 2021లో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంటే కూడా ఆయన రూ.33 కోట్ల ఆస్తులు కొన్నాడు. 
– ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి..మీకు పసుపు కరోనా ఏమైనా కాటేసిందా? 
– 2018 నుంచి 2024 వరకూ ఆయన చేసిన సినిమాలు కూడా నాలుగు. 
– అందులో యావరేజ్‌గా ఆడిన సినిమాలు రెండు..మిగతావి డిజాస్టర్‌ అయ్యాయి.  మరి మీకు రూ.90 కోట్ల ఆస్తులు మీకు ఎలా వచ్చాయి? 
– సినిమా రంగం నుంచి వచ్చాయా? జనసేన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెడితే వచ్చాయా? అని పార్టీ నేత పోతిన మహేష్ సూటిగా ప్రశ్నించారు. 

Back to Top