వైయస్ఆర్ జిల్లా: ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి షాకిస్తూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పులివెందులలో నామినేషన్ వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి (టీడీపీ) సోదరుడు శ్రీనాథ్ రెడ్డి, దంపతులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరు. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి పోటి చేసిన విషయం విధితమే. వైయస్ఆర్ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు: వీరశివారెడ్డి ఏపీలో సంక్షేమ పథకాల్ని సీఎం వైయస్ జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు. ఆ సంక్షేమ పథకాల్ని చూసి అకర్షితుడనై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ఈ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా సేవల్ని ఎలా ఉపయోగించుకున్నా సరే. ఏ పని అప్పగించినా విధేయంగా పని చేస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు వల్ల ఏపీకి ప్రయోజనం లేదు. ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదన్నారు. ఏపీలో మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఖాయమని వీరశివారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.