పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే వరప్రసాద్‌
 

విజయవాడ: నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గంలో ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వరప్రసాద్‌ కోరారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 2019లో ప్రజలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు. తనకు 46 వేల మెజారిటీ ఇచ్చారన్నారు. చెన్నై– బెంగుళూరు కారిడార్‌ను అతిత్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎస్‌ఈజెడ్‌లో శ్రీసిటీలో ఉన్నట్లుగా మా నియోజకవర్గంలో కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎస్‌ఈజెడ్‌ కోసం భూములు కోల్పయిన డికేటి, అసైండ్‌ ల్యాండ్‌కు పరిహారం రూ.13 లక్షలు ఇస్తుందని కలెక్టర్‌ చెప్పారని, శాశ్వతంగా భూములు దూరమవుతున్నాయి కాబట్టి కనీసం రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. గూడురు నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకురావాలని కోరారు. 
 

Back to Top