డాక్టర్‌ సుధాకర్‌.. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ పథకం ప్రకారమే డాక్టర్‌ సుధాకర్‌ తప్పతాగి నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. యాక్షన్‌ ప్లాన్‌ అంతా టీడీపీ ఆఫీస్‌లో రెడీ అయిన స్క్రిప్టు ప్రకారమే డాక్టర్‌ సుధాకర్‌ నీచంగా ప్రవర్తించాడన్నారు. ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, అ‍య్యనపాత్రుడి చేతుల్లో డాక్టర్‌ సుధాకర్‌ కీలు బొమ్మలా మారాడని విమర్శించారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పాయకరావుపేట సీటు కోసం సుధాకర్‌ ప్రయత్నం చేశాడని, సీటు రాకపోవడంతో వైద్య విధాన పరిషత్‌ కమిషన్‌ రాజీనామా ఆమోదించకపోవడంతో మళ్లీ విధుల్లో చేరాడన్నారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు చంద్రబాబు డాక్టర్‌ సుధాకర్‌ను వాడుకుంటున్నాడన్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ లబ్ధి కోసమే సుధాకర్‌ విషయంలో చంద్రబాబు, లోకేష్‌ కులాన్ని లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top