ఆడబిడ్డలను కాపాడేందుకు జగనన్న వచ్చారు

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రతి కుటుంబంలో సంతోషం

ఇచ్చిన హామీలు నెరవేర్చని చేతగాని దద్దమ్మ చంద్రబాబు

అమ్మ ఒడి పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

వెలగపూడి: గత చంద్రబాబు పాలనలో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయి. బాల్య వివాహాల్లో నంబర్‌. 1 స్థానంలో ఉంది. మహిళలకు భద్రత లేకుండా గత ప్రభుత్వాలు చేశాయి. కానీ, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత మహిళా రక్షణ కోసం మహిళా మంత్రే ఉన్నారని, ప్రతి ఆడబిడ్డను కాపాడేందుకు మా జగన్‌ అన్న ఉన్నారని రాష్ట్రంలోని మహిళలంతా అన్న వచ్చాడు.. మా పెద్దాయన కొడుకు వచ్చాడని సంతోషంగా ఉన్నారన్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ.. గవర్నర్‌ ప్రసంగంలో ప్రతి మహిళా కాపురాలు చక్కదిద్దబడతాయి.. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని సంక్షేమ పథకాలు చూస్తేనే అర్థం అవుతుందన్నారు. 85 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి ఏ విధంగా ఎగ్గొట్టారో చూశామన్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తామని రూ. 2350 కోట్లు ఎగనామం పెట్టి డ్వాక్రా మహిళలను నట్టేట ముంచింది గత చంద్రబాబు ప్రభుత్వ కాదా.. అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తామన్నది చంద్రబాబు... ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇచ్చిన హామీని నెరవేర్చలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు.. బోయపాటి శ్రీనుతో యాడ్స్‌ చేయించి డ్వాక్రా రుణమాఫీ చేశామని అబద్ధపు ప్రకటలు ప్రజలపై రుద్ధారని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై పోరాటం చేస్తామని  సిగ్గు, శరం లేకుండా చంద్రబాబు చెప్పడం ఎంత వరకు సమంజసం అన్నారు. రైతులనే కాకుండా డ్వాక్రా మహిళల రుణమాఫీ, వడ్డీలేని రుణాలను ఎగ్గొట్టి మోసం చేసినందుకు చంద్రబాబు, ఆయన కోటరీ పొర్లుదండాలు పెట్టి క్షమాపణలు చెప్పాలన్నారు. 

మహిళల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక పథకాలు తీసుకొచ్చారని ఆర్కే రోజా అన్నారు. నవరత్నాల్లో ముఖ్యమైనది అమ్మ ఒడి.. ఈ దేశంలోనే ఈ పథకం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు, బిడ్డల చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకునే మహిళల కష్టాలు తీర్చేలా అమ్మ ఒడి పథకం ఉంటుందన్నారు. అమ్మ ఒడి పథకం ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌ లాగా దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందన్నారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగు సంవత్సరాల్లో రూ. 75 వేలు అందజేస్తామన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో అనేక మంది మహిళలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు వచ్చిన బాధలు వినిపించారన్నారు. వారి కష్టాలు విని ఈ పథకం వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. ప్రతి డ్వాక్రా మహిళను ఈ ప్రభుత్వం లక్షాధికారులను చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట ఇస్తే జీఓలు, చట్టాలు అవసరం లేదు అన్న నమ్మకం ప్రతి మహిళకు కలుగుతుందన్నారు. సొంత ఇంటి కలను కూడా నెరవేర్చే బాధ్యతను ముఖ్యమంత్రి తీసుకున్నారని, ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించి మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తారని హామీ ఇచ్చారని, తప్పకుండా గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌ను చూస్తామన్నారు. 

టార్చర్‌ చంద్రబాబు పాలనకు.. టార్చ్‌బేరర్‌ వైయస్‌ జగన్‌ పాలనకు చాలా తేడా ఉందన్నారు. పాదయాత్రలో మహిళలు మద్యపానం తమ కుటుంబాల్లో పెట్టిన చిచ్చును వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారని, ఆ కష్టాలు విని వారి కన్నీళ్లు తుడవాలనే ఉద్దేశంతో దశల వారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారన్నారు. బెల్టుషాపులు వీధి వీధిన పెట్టి ఆడవారి మాన, ప్రాణాలతో ఆడుకున్న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి బాధ అనిపించలేదా..? బ్యాంకుల్లో అప్పుకూడా పుట్టని స్థితికి డ్వాక్రా మహిళలను తీసుకొచ్చారు. నారాయణ కాలేజీల్లో ఆడపిల్లలు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు మీ చుట్టూ తిరుగుతుంటే మీకు బాధ అనిపించలేదా అని టీడీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. మొదటి సంతకాన్ని కూడా అమలు చేయలేని దౌర్భాగ్యపాలన చంద్రబాబు అందించారన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top