చంద్రబాబు చిన్న మెదడు చితికినట్లుంది

ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా
 

చిత్తూరు:  ఎన్నికల్లో ఓటమి కారణంగా చంద్రబాబుకు మతిభ్రమించినట్టుందని, చిన్న మెదడు చితికిందని ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్ చల్లని పాదం మోపడంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని, దాంతో ఇసుకకు కొద్దిమేర ఇబ్బంది ఏర్పడిందని అన్నారు. అయితే దీనిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. ఏపీలో వైయస్‌ జగన్ పాలన చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారని రోజా అన్నారు.

Read Also: మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహించాల్సింది పోయి..విమర్శలా?

Back to Top