వాస్తవాలు ఎదుర్కోలేకే.. కూటమి నేతల వ్యక్తిగత దూషణలు

సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు

ఆగ్రహం వ్యక్తం చేసి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీజనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి

తాడేపల్లి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలను కప్పిపుచ్చుకునేందుకే ఈ ఎత్తుగడలు

బూతులు మాని.. దమ్ముంటే వాస్తవాలతో బహిరంగ చర్చకు రండి

కూటమి ప్రభుత్వానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్

తాడేపల్లి: ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా తాము సంధించే ప్రశ్నలకు వాస్తవాలతో సమాధానం చెప్పలేకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా కూటమి నేతలంతా దిగజారి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్. జగన్ కు రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న విశేష ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఈ విధంగా తిట్ల పురాణానికి తెరతీశారని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించని చంద్రబాబు, ప్రాజెక్టులన్నీ తానే కట్టానంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, మహిళలపై దాడులు జరుగుతూ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. వాటి నుంచి డైవర్ట్ చేయడానికే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు, బూతులు కట్టిపెట్టి.. దమ్ముంటే తాము లేవనెత్తుతున్న వాస్తవాలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన కూటమి నేతలకు సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...

- జనాదరణ చూసి ఓర్వలేకే ఈ తిట్ల పురాణం..

చంద్రబాబు, లోకేష ఇద్దరు తండ్రి-కొడుకులు,  కూటమి నాయకులు వేదిక ఏదైనా వ్యక్తిగత దూషణలు, అసత్యాలు మాట్లాడటమే ఏకైక పనిగా పెట్టుకున్నారు. వైఎస్. జగన్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో సహా ఏ ప్రాంతానికి వెళ్లినా వస్తున్న విశేష జన ప్రభంజనాన్ని చూసి వీరు ఆందోళన చెందుతున్నారు. ఆ బాధను దిగమింగలేకనే వైయస్. జగన్ గారిపై వ్యక్తిగతంగా తిట్ల పురాణానికి తెరతీశారు. మాకు సంస్కారం అడ్డు వస్తుంది కాబట్టే బూతులు మాట్లాడం. అధికార పక్షం తిట్టే తిట్లను ప్రజల కోసమే భరిస్తాం, ప్రతిపక్షంగా ప్రజల పక్షానే నిలబడి వాస్తవాలను నిలదీస్తాం.

- ప్రాజెక్టులపై అబద్ధాలు.. మీ హయాంలో ఒక్క డిజైన్ అయినా చేశారా?

వ్యవసాయం దండగ, ప్రాజెక్టులు దండగ అని పుస్తకాలు రాసిన చంద్రబాబు, నేడు వెలుగొండ ప్రాజెక్టు తానే పూర్తి చేశానని చెప్పడం హాస్యాస్పదం. 1996లో శంకుస్థాపన శిలాఫలకానికి కేవలం రూ. 5, 6 లక్షలు ఖర్చు పెట్టిన బాబు, పదేళ్లలో ఇంకేమీ చేయలేదు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల కోట్లు ఖర్చు పెట్టి 20.8 కిలోమీటర్ల టన్నెల్స్ తవ్వించారు. ఆ తర్వాత వచ్చిన వైయస్.జగన్  రో రూ. 3 వేల కోట్లు వెచ్చించి ప్రాజెక్టును పూర్తి స్థాయికి తెచ్చారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు 25 అనుమతులు సాధించి, కాలువలు తవ్వించింది వైఎస్సార్ అయితే.. దానికి 4 మోటార్లు బిగించి పట్టిసీమ అని పేరు పెట్టుకుని బాబు క్రెడిట్ తీసుకున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు..మీ హయాంలో ఒక్క ప్రాజెక్టుకైనా కనీసం డిజైన్ చేశారా? శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన మహానేతల పేర్లు స్మరించుకోవడానికి కూడా ఆయనకు మనసొప్పదు.శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎవరో కట్టారు? గౌరవ నీలం సంజీవ రెడ్డి గారు.  మన నాగార్జున సాగర్ బ్రహ్మానంద్ రెడ్డి గారి యొక్క హాయంలో కంప్లీట్ అయ్యి, ఆ రెండు ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాంతం గాని ఆంధ్రప్రదేశ్ గాని అన్నపూర్ణగా మారడానికి కారకులైనటువంటి వాళ్లను ఆ పేరును స్మరించడానికి నువ్వు ఇష్టపడలేదు అంటే, నువ్వు ఎంత దుర్మార్గుడవో అర్థమవుతోంది.

- మహానేతల ప్రాజెక్టులపై చంద్రబాబు క్రెడిట్: 

నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి బృహత్తర ప్రాజెక్టులను బ్రహ్మానంద రెడ్డి, సంజీవ రెడ్డి లాంటి నాయకులు నిర్మించి ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తే, తన హయాంలో ఏ ప్రాజెక్టూ కట్టని చంద్రబాబు అన్నీ తానే చేశానని పదే పదే అబద్ధాలు చెబుతూ ఇతరుల క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టుకు కేవలం రెండు సార్లు శంకుస్థాపన చేసిన చంద్రబాబు కనీసం ఆ ఖర్చులకు కూడా నిధులు ఇవ్వలేదు. దానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే. ధైర్యం ఉంటే దీనిపై చర్చకు రావాలని సవాల్.

- ప్రాజెక్టులు ఇతరులవి.. ప్రచారం బాబుది: 

గండికోట, గుండ్లకమ్మ, తెలుగు గంగ, సోమశిల, కండలేరు వంటి అనేక రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసిందెవరో, నిధులు ఇచ్చిందెవరో లెక్కలతో సహా అడిగితే సమాధానం చెప్పరు. ఎదురుదాడి చేస్తూ తానే అన్నీ చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారింది.

- వివేకా హత్య కేసు విచారణను అడ్డుకుంటున్నది మీరే కదా?

వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అన్న వాస్తవాన్ని దాచిపెట్టి,  వైయస్.జగన్ చేశారని మాట్లాడటానికి లోకేష్ కు కొంచెమైనా విజ్ఞత ఉండాలి. ట్రైల్ జరిగితే వాస్తవాలు బయటకు వస్తే.. మీ నైజం బయటపడుతుంది, మీకు రాజకీయంగా మాట్లాడ్డానికి ఏమీ ఉండదు, ఆ తప్పు మీపై వస్తుందని.. సిబిఐ ఎంక్వయిరీ చేసిన కేసుని కూడా ట్రైల్ జరగనీయకుండా ఆపుతుంది ఎవరు? ఈరోజు అక్కడ హత్య చేసిన మనుషులుకు, నీకు ఒకే లాయర్ ఉన్నాడా లేదా? ఇన్ని వాస్తవాలు కళ్లకు  స్పష్టంగా కనబడుతుంటే...  దుష్ప్రచారమే మీ విధానం అన్నట్టు మాట్లాడుతున్నారు. మేం మీలాగా మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం ఉంది. మా విధానం అది కాదు. 

- క్షీణించిన శాంతిభద్రతలు.. సెల్ఫీ వీడియోలు పెట్టి ఆత్మహత్యలు..

రాష్ట్రంలో ప్రతి రోజూ హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. దళితులను వివస్త్రలను చేసి, వారిపై దారుణంగా దాడి చేస్తున్నారు. జ్ఞానేశ్వరి లాంటి యువతులపై దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదు. పోలీసుల వేధింపులు తాళలేక ప్రజలు సెల్ఫీ వీడియోలు పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ వైఫల్యాలను, వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికే కూటమి నేతలు వ్యక్తిగత విమర్శలకు, బూతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ వైయస్. జగన్ వల్లే వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులే స్పష్టంగా చెప్పినా కూడా చంద్రబాబు అసత్యాలే మాట్లాడుతున్నారు.

- వాస్తవాలు మాట్లాడే దమ్ముంటే.. బహిరంగ చర్చకు రండి!

ఈ నేపధ్యంలో మేము అడిగే వాస్తవాలకు సమాధానం చెప్పలేక కూటమి నేతలు ఎదురుదాడి చేయడమే  విధానంగా మార్చుకున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని.. తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. కూటమి నేతలు తాము చెప్పేవి వాస్తవాలు, మేము చెప్పేవి అసత్యాలు అని భావిస్తే.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కూటమి పార్టీ నుంచి ఎవరొచ్చినా వాస్తవాలేంటో ఆధారాలతో మాట్లాడుకుందామన్న శ్రీకాంత్ రెడ్డి... బహిరంగ చర్చకు వచ్చే దమ్ము, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉందా? అని నిలదీశారు.

Back to Top