తాడేపల్లి: రేపు (16.07.2026, గురువారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.