మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహించాల్సింది పోయి..విమర్శలా?

మద్యపాన నిషేధంపై చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు

నేరాలకు ప్రధాన కారణం మద్యమే

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

గుంటూరు: మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధాన్ని ప్రోత్సహించాల్సింది పోయి..విమర్శలు చేయడం సరికాదని సూచించారు. గుంటూరులో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. మద్యపాన నిషేదం రాష్ట్రాలు చేయాల్సిన నైతిక బాధ్యత అన్నారు. రాజ్యాంగంలో ఆదేశ సూత్రాలు పెట్టుకున్నామని, రాష్ట్రాలు చేయాల్సిన బాధ్యతలు అందులో ఉన్నాయన్నారు. ఆర్టికల్‌ 47 ప్రకారం ఇవాళ ఆదేశిక సూత్రాలలో నైతిక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపాన నిషేదానికి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు హేళన చేస్తున్నారని ప్రశ్నించారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 21 సంవత్సరాల వయసు తక్కువ ఉన్న వారిలో 2 శాతం నుంచి 4 శాతానికి పదేళ్లలో పెరిగిందన్నారు. చిన్నపిల్లలు మద్యానికి బానిక అవుతున్నారన్నారు. డబ్ల్యూహెచ్‌ ప్రకారం మద్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. 40 శాతం రోడ్డు ప్రమాదాలకు మద్యమే కారణమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కుటుంబాలు మరింత పేదరికంలో కూరుకుపోవడానికి మద్యమే కారణమన్నారు. సంపాదన అంతా కూడా మద్యానికే తగలేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి మహిళలు తీసుకువచ్చారన్నారు. ఆ రోజు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ దృష్టికి మహిళలు తీసుకువచ్చారన్నారు. దీంతో మద్యపాన నిషేధాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో మద్యం తాగే వారి శాతం తగ్గిందన్నారు. బెల్ట్‌షాపులు తగ్గడం వల్ల కుటుంబాలు నెమ్మదిగా బాగుపడుతున్నాయని మద్యతరగతి మహిళలు సంతోషంగా చెబుతున్నారన్నారు. మద్యనిషేధం చేస్తే కాపు సారా వస్తుందని విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తే..చంద్రబాబే దాన్ని ఎత్తేయించారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పుడు తిరిగి మద్యపాన నిషేధం జరుగుతుంటే రకరకాలుగా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. మద్యపాన నిషేధానికి ఎలాంటి అడ్డంకులు వస్తాయన్న వాటిపై సూచనలు చేయాలే కానీ, హేళనగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు ఒకస్థాయికి వచ్చిన తరువాత మద్యాన్ని నిషేధించాలన్నారు. మద్యపాన నిషేధంపై సలహాలు, సూచనలు ఇవ్వాలే కాని హేళనగా మాట్లాడటం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తగదని హితవు పలికారు.
 

Read Also: విద్యార్థుల భవిష్యత్‌ కోసమే ఇంగ్లీష్‌ మీడియం

Back to Top