చంద్రబాబుది దొంగ దీక్ష

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి
 

విజయవాడ:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక చంద్రబాబు ఇసుక పేరుతో దొంగ దీక్ష చేస్తున్నాడని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై టీడీపీ చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించమంటే చంద్రబాబు పారిపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు.టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇసుక దోపిడీలో వేల కోట్లు సంపాదించారని పేర్కొన్నారు. వరదలతోనే ఇసుక కొరత ఏర్పడిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం లక్షా 50 వేల టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నామని చెప్పారు.

 

Read Also: పేదరిక నిర్మూలనకు చదువు ఒక్కటే ఏకైక మార్గం

Back to Top