పేదరిక నిర్మూలనకు చదువు ఒక్కటే ఏకైక మార్గం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

చదువు ఒక్కటే నిజమైన సంపద

నేటి బాలలే రేపటి నవసమాజ నిర్మాతలు

ల్యాండ్‌ ఫోన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు వచ్చాం

పదేళ్ల తరువాత ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించగలరా..?

ఇంగ్లిష్‌ సరిగ్గా మాట్లాడలేకపోతే పిల్లలకు భవిష్యత్‌ ఉండదు

ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను తీర్చిదిద్దుకుందాం

పిల్లలకు మంచి చేయాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం

అందుకు రాజకీయంగా, వ్యక్తిగతంగా నన్ను టార్గెట్‌ చేస్తున్నారు

విమర్శలు చేసేవారు.. మీ బిడ్డలు, మీ మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలా.. పేదవాడు చదవకూడదా..?

సమాజం బాగుపడాలంటే అందరూ బాగుపడాలి

నాడు –నేడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది

45 వేలకపైగా ప్రభుత్వపాఠశాలలు, మొదటిదశలో 15715 స్కూళ్ల అభివృద్ధి

1నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం, ఏటేటా పెంచుకుంటూపోతాం

రూ.12 వేల కోట్లతో పాఠశాలల రూపురేఖలు మార్చుతాం

ప్రతి అడుగులో చాలెంజ్‌ ఉంటుంది.. వాటిని అధిగమిస్తాం

జనవరి 9వ తేదీన అమ్మఒడికి శ్రీకారం చుట్టబోతున్నాం

పిల్లలను బడులకు పంపించిన ప్రతితల్లికి రూ.15 వేలు ఇస్తాం

పేదవాడిని చదివించేందుకు పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ పథకం

దేశంలో ఎక్కడాలేని స్కిల్‌ డెవలప్మెంట్  యూనివర్సిటీ తీసుకొస్తున్నాం

ఒంగోలు: పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసమే నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, పిల్లల మంచి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా నన్ను టార్గెట్‌ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మన బడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు.

ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, చిన్నారులకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి. నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలు, వారే నిర్ణేతలు. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. వారి జీవితాలు మార్చాలనే తపన, తాపత్రయం కొందరిలో కనిపించడం లేదు. ఈ రోజు నవంబర్‌ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎక్కడైనా ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ 2039-2040 తరువాత గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తాడు. పెరిగిన తరువాత ఆ బిడ్డ ఆ నాటి సమాజంలో తలెత్తుకు తిరగాలంటే 2030 నాటికి ప్రపంచం అన్నది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మన పదేళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. ఇప్పటికే ల్యాండ్‌ ఫోన్‌ రోజుల నుంచి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా ఇంటర్‌నెట్‌ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మరో పదేళ్లలో రోబోటిక్స్‌ ఏస్థాయిలో ఉంటాయో ఆలోచించండి. కార్లకు కూడా డ్రైవర్లు లేని రోజులు రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనం ఆలోచన చేయాలి. మనకు ఇంగ్లీష్‌ చదువులు రాకపోతే , ఇంగ్లీష్‌ సరిగా మాట్లాడలేకపోతే వారిభవిష్యత్‌ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో ఇవాళ  మనకు ఉన్న సమస్యలు ఏంటి? ఎంత మంది చదువురాని వారు ఉన్నారని లెక్కలు తీస్తే అక్షరాల 33 శాతం మందికి చదువు రాని పరిస్థితిలో ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి..పేదరికం అన్నది ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. మన ముందుర ఉన్న సమస్యలు, సవాళ్లను ఒక్కసారి చూడండి. మన పిల్లలను ప్రపంచంలో పోటిపడే స్థాయిలో తీర్చిదిద్దాల్సిన సవాలు మన ముందుర ఉంది. ప్రభుత్వం ఇప్పటి నుంచే అండదండగా నిలబడటమా? లేక వారి తలరాతలు ఇంతే అని వదిలేద్దామా? ఏంనిర్ణయం తీసుకోవాలో ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోకపోతే తలరాతలు మారవు. పేదవారు చదువుకునే బడులను చదువుల దేవాలయాలుగా మార్చేందుకు ఇవాళ నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాసి, ప్రభుత్వ పాఠశాలలను శిథిలావస్థలోకి నెట్టారు. ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. ఈ తరం పిల్లలకు ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడేలా తీర్చిదిద్దాలా? లేక ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి, ఏ జర్నలిస్టు కూడా, ఏ సినినటుడు కూడా వాళ్ల పిల్లలను ప్రభుత్వ బడుల్లో, తెలుగు మీడియంలో ఎవరూ కూడా చదివించడం లేదు. మార్పు అన్నది రావాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మార్పుకు శ్రీకారం చుడుతున్నాం. పేదవాడు తెలుగు మీడియంలోనే చదవాలని మన సంస్కృతి అంటుందని వదిలేస్తే..అదే సంస్కృతి పేదవాడిని పై నుంచి కింది వరకు వెటకారంగా చూస్తుంది. ఈ రోజు నాయకుడిగా ఉన్న మనం అలాగే వదిలేస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే. నిజాయితీగా ఆలోచన చేయండి. విద్యావిధానాన్ని మార్పు చేసి విద్యావిధానంలో ఇంగ్లీష్‌ మీడియం చదువులు తీసుకువచ్చి ప్రపంచంలో పోటీపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు పోటీ పడుతున్నది మన సమాజంతోనే కాదు..మొత్తంగా ప్రపంచ జాబ్‌ మార్కెట్‌తో పోటీ పడుతున్నారు. మరో ఐదేళ్లు, పదేళ్లు, 20 ఏళ్లు పోతే తెలుగు సమాజంలోని మన బిడ్డలను ప్రపంచంతో పోటీ పడేలా అడుగులు వేయాలా? వద్దా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పరిస్థితి ఒక్కసారి చూడండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే పోటీ ప్రపంచంలో మన పిల్లలు పోటీ పడలేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. మరో పదేళ్లకు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి ఉండదు. కూలీలు, డ్రైవర్లుగానే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇవాళ టార్గెట్‌ చేస్తున్నారు. నా వల్ల తెలుగు జాతి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని అవాక్కులు, చవాక్కులు పేల్చుతున్నారు. వీరందరిని కూడాఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండని అడుగుతున్నాను. రాజకీయ నాయకులు, పత్రికా అధిపతులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు, సిని రంగంలో స్థానం సంపాదించిన వారిని అడుగుతున్నాను. మీ బిడ్డలు, మీ మనవళ్లు మాత్రమే ఇంగ్లీష్‌ మీడియం చదవాలా? పేదవాళ్లు వద్దా అని అడుగుతున్నాను. ఏ కొందరో బాగుపడితే సమాజం బాగుపడదు. అందరూ బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందదని చెబుతున్నాను. పేదరికం నుంచి బయట పడాలంటే మనకు ఉన్న ఏకైక మార్గం చదువు ఒక్కటే. దొంగలు సైతం ఎత్తుకెళ్లని ఆస్తి. మన పిల్లలు బాగా చదువుకుంటేనే డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదుగుతారు. ఇదే వేదికపై విద్యాశాఖ మంత్రి సురేష్‌ ఉన్నారు. నా సహచరుడు, ఐఆర్‌ఎస్‌ అధికారి. సురేష్‌ను ఈ మైక్‌ తీసుకోకముందే అడిగాను. 7వ తరగతి వరకు సురేష్‌ చదివింది తెలుగు మీడియమే. జీవితం బాగుపడాలంటే ఇది సరిపోదని ఇంగ్లీష్‌ మీడియం వైపు అడుగులు వేశారు. విద్యాశాఖ అధికారి రాజశేఖర్‌ కూడా  ఇంటర్‌ మీడియం వరకు తెలుగు మీడియం చదివారు. ధనుంజయరెడ్డి ఐఏఎస్‌ కూడా ఇంటర్‌ వరకు తెలుగు మీడియమే చదివారు. ఆయన కూడా ఇంగ్లీష్‌ మీడియం వైపు అడుగులు వేశారు. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశాను. వారి పిల్లలను గొప్పగా చదువుకోవాలని తపన పడ్డారు. బాధపడిన పరిస్థితులు చూశాను కాబట్టే..ఆ పరిస్థితులను మార్చేందుకు ఈ రోజు చరిత్రను మార్చబోయే తొలి అడుగులు వేస్తూ నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. పాదయాత్రలో నేను చూశాను. నేను ఉన్నాను అని చెప్పాను. ఈ రోజు నేనున్నానని అడుగులు వేస్తున్నాను. రాష్ట్రంలోఅక్షరాల 45 వేల స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో మొదటి ఏడాది 15 వేల స్కూళ్లలో జూన్‌, జులై దాకా నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక మీదట ఆ స్కూళ్లలో మరుగుదొడ్డి, తాగునీరు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు, బ్లాక్‌ బోర్డులు ఉంటాయి. అవసరమైన మేరకు అదనపు తరగతి గదులు ఉంటాయి. ఇలా 9 రకాల మౌలిక సదుపాయాలు ఈ స్కూళ్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి స్కూల్‌లో కచ్చితంగా ఇంగ్లీష్‌ మీడియం చేస్తునే తప్పనిసరిగా తెలుగు సబ్జెట్‌ ఉంటుందని చెబుతున్నానున. రేపటి సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు మొదటి ఏడాది ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం. ఆ తరువాత వరుసగా ఇంగ్లీష్‌ మీడియం చేస్తాం. మొదట పిల్లాడు కొంత కష్టపడుతాడు. ఇప్పటికే పేరేంట్‌ కమిటీలు వేశాం. స్కూళ్లలో జరుగుతున్న కార్యక్రమాల్లో తల్లిదండ్రులను బాగస్వామ్యం చేశాం. టీచర్లకు కూడా ట్రైనింగ్‌ ఇస్తాం. బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేసి పిల్లలకు తోడుగా ఉంటాం. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. సవాళ్లు అన్నది లేకుండా ఉండవు. వాటిని ఎదుర్కోవాలి. ఒక సంవత్సరం కష్టపడుతాం. మూడో సంవత్సరానికి తెరుకుంటాం. నాలుగో సంవత్సరంలోగా పిల్లలు అన్ని నేర్చుకుంటున్నారు. తెలుగు మీడియంలోనే ఉంటారంటే వారి తలరాతలు మారవు. ఈ రోజు తీసుకున్న నిర్ణయంతో నన్ను ఎంత మంది వ్యతిరేకంగా మాట్లాడినా వెనుకడుగు వేయను. గత ఆర్థిక సంవత్సరం స్కూళ్లను మెరుగు పరిచేందుకు కేటాయించింది కేవలం రూ.20 కోట్లు మాత్రమే. ఈ డబ్బులు 45 వేల స్కూళ్లకు ఏ రకంగా సరిపోతుంది. పిల్లల బతుకుల గురించి ఎవరు కూడా ఆరాటపడలేదు. ప్రతి ఏటా 15 వేల స్కూళ్లను నాడు-నేడు కార్యక్రమంలో రూపురేఖలు మార్చబోతున్నాం.ఇందుకోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఓ చిన్నారి అన్నా ప్రభుత్వ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది ..ఇదంతా చేయగలవా అని అడిగింది. ప్రతి అడుగులోను చాలెంజ్‌ ఉంటుంది..దాన్ని అధిగమిస్తాం. ప్రతి బడి ఫోటో తీయమని చెప్పాం. రేజు జూన్‌ మాసం కల్లా వచ్చే ఏడాది ఎలా ఉందో చూపిస్తాం. ఈ గొప్ప కార్యక్రమాలు చేసేటప్పుడు అవాంతరాలు చాలా వస్తాయి. మీ అందరి దీవెనలు, దేవుడి దయతో అధిగమిస్తానని చెబుతున్నాను. మన పిల్లలను చదివించేందుకు అడుగులు వేస్తున్నాం. జనవరిలో అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతాను. ప్రతి తల్లికి చెబుతున్నాను. మీ పిల్లలను కేవలం బడికి పంపించండి ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు మీ ఖాతాలో పెడతానని చెబుతున్నాను. బడులను మరమ్మతులు చేయిస్తున్నాం. అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. మీ అన్న మీకు తోడుగా ఉంటారు. ఈ వ్యవస్థలో మార్పులు రావాలి. స్కూళ్ల నుంచి కాలేజీల వరకు వెళ్తాం. కాలేజీల్లో కూడా పరిస్థితులు గమనిస్తే..ఇంటర్‌ పూర్తి అయిన తరువాత డిగ్రీలు చదవడం లేదు. కేవలం 24 శాతం మాత్రమే ఇంజినీర్లు, డిగ్రీలు చదువుతున్నారు. జీఈఆర్‌ రేషియే ఏ స్థాయిలో ఉందో గమనించండి. ప్రతి పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ కుటుంబం నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. ఆ పేదవాడిని చదవించేందుకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌  ఇస్తామని ఈ వేదిక నుంచి సగర్వంగా చెబుతూ..అంతేకాదు..ఆ పిల్లలు రేపు పొద్దున హాస్టల్లో ఉండేందుకు అయ్యే ఖర్చులకు కూడా ఏటా రూ.20 వేలు ఇస్తాం. ప్రతిపిల్లాడిని గొప్పగా చదివిస్తాం. ఇంజినీర్‌, డిగ్రీ చదువుల్లో కూడా మార్పు తీసుకురాబోతున్నాం. ఒక ఏడాది అప్రెంటిషిప్‌ తీసుకువస్తాం. ఇవన్నీ చేయడమే కాకుండా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం. దేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామో తెలుసా? రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టేందుకు వస్తే..అసెంబ్లీలో చట్టం తెచ్చాం. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానం చేశాం. పేదవాడికి మేలు చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. దేశంలో జీడీపీ దెబ్బతింటుందని అందరూ చెబుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం గర్వంగా చెబుతున్నాను. రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు  ఇవ్వగలిగామని చెబుతున్నాను. ప్రతి ఊరిలో పది మందికి ఉద్యోగాలు ఇచ్చామని గర్వంగా చెబుతున్నాను. ప్రతి కార్యక్రమంలోను సవాళ్లు ఉన్నాయి. అయినా అడుగులు ముందుకు వేస్తున్నాను. బాట కష్టమైనదే. శత్రువులు కూడా ఎక్కువగా ఉన్నారు. మీ బిడ్డను దీవించండి. దేవుడి దయతో మంచి చేస్తానని మీ అందరికి సవినయంగా చెబుతూ సెలవు తీసుకుంటున్నా..

 

Read Also: మనబడి పుస్తకం ఆవిష్కరణ

తాజా ఫోటోలు

Back to Top