పద్మ పురస్కార విజేతలకు  వైయస్‌ జగన్ అభినందనలు

తాడేపల్లి: 2026వ సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను అందుకున్న విజేతలకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో తమ విశిష్ట సేవలతో దేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు గౌరవం తెచ్చిన ప్రతి విజేత ప్రశంసనీయులని ఆయన అన్నారు. మీరు సాధించిన ఈ అత్యున్నత గుర్తింపు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విజేతల సేవలు భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగి, దేశ అభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షిస్తూ, వారి ప్రయాణం మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top