నాంపల్లి అగ్నిప్రమాదంపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

తాడేపల్లి: హైదరాబాద్‌ నాంపల్లి ప్రాంతంలో జరిగిన ఫర్నిచర్‌ షాప్‌ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడటం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నారు. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలు ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునేలా దేవుడు వారికి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు.

Back to Top