వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లోనే గిరిజ‌నుల‌కు మేలు

ఆర్థికంగా, రాజ‌కీయంగా తోడు నిలిచింది జ‌గ‌నే

స్ప‌ష్టం చేసిన గిరిజ‌న నాయ‌కులు 

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాయ‌లంలో ఘ‌నంగా శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జ‌యంతి వేడుకలు

తాడేప‌ల్లి: వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లోనే గిరిజ‌నుల‌కు ఆర్థికంగా, రాజ‌కీయంగా మేలు జ‌రిగింద‌ని, ఆయ‌న మ‌ళ్లీ సీఎం అయితేనే మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుందని గిరిజ‌న నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. గిరిజ‌నులంతా ఏక‌తాటిపైకి వ‌చ్చి వైయ‌స్ జ‌గ‌న్ గారిని సీఎంగా తీసుకొచ్చి మ‌ళ్లీ సీఎంని చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. గ‌త ఐదేళ్ల పాల‌న‌లో గిరిజినుల‌ను ఆర్థికంగా సామాజికంగా ఆయ‌న అండ‌గా నిల‌బడినందుకు వారు కృత‌జ్ఞ‌త తెలిపారు. తాడేప‌ల్లి లోని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ రాష్ట్ర గిరిజ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో "శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్" 287 వ జయంతి కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ సంచార జాతులుగా ఉండే బంజారాల‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘ‌న‌త శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్  కే ద‌క్కుతుంద‌ని నాయ‌కులు చెప్పారు. పాద‌యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్ గారిని క‌లిసి 500 జ‌నాభా ఉండే తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా చేయాల‌ని కోరగా అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే 250 తండా పంచాయ‌తీల‌ను ఏర్పాటు చేసి ఇచ్చిన హామీని నెర‌వేర్చారని గుర్తుచేసుకున్నారు. రిజ‌ర్వేష‌న్ల‌న్నీ ఏజెన్సీ ప్రాంతాల‌కే పరిమిత‌మైన నేప‌థ్యంలో మైదాన ప్రాంతంలో ఉండే గిరిజ‌నుల‌కు రాజ‌కీయ ప్రాధాన్యం క‌ల్పించాల‌ని వారు కోరారు. రాబోయే రోజుల్లో వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎం  అయ్యాక ఎరుక‌ల, యానాది, లంబాడి, చెంచు కుల‌స్తుల‌కు న్యాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో కూడా లంబాడీల‌కు బోర్డు మెంబ‌ర్‌గా, శ్రీశైలం బోర్డులో మెంబ‌ర్లు అవ‌కాశం క‌ల్పించార‌ని వారు ప్ర‌శంసించారు. దీంతోపాటు ఎస్టీ క‌మిష‌న్ మెంబ‌ర్‌గా, ఎస్వీబీసీ ఛానెల్‌లో అడ్వైజ‌ర్‌గా ఒక మ‌హిళ‌కు అవ‌కాశమిచ్చిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా  వైయ‌స్ జ‌గ‌న్ గారు సీఎంగా ఉండ‌గా 1.53 ల‌క్ష‌ల కుటుంబాల‌కు 3 ల‌క్ష‌ల ఎక‌రాలు ఆర్వోఎస్ఆర్ ప‌ట్టాలు పంపిణీ చేశారని, 25 వేల కుటుంబాల‌కు 38717 వేల ఎక‌రాలు డీకేటీ ప‌ట్టాలిచ్చి గౌర‌వించార‌ని చెప్పారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక సీఎం చంద్ర‌బాబు గిరిజ‌న‌ల‌ను పూర్తి విస్మించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుగాలి ప్రీతి హ‌త్యాచారాన్ని రాజ‌కీయంగా వాడుకుని ఎన్నిక‌ల్లో గెలిచిన కూట‌మి నాయ‌కులు.. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్ల‌వుతున్నా వారి కుటుంబానికి ఇంత‌వ‌ర‌కు న్యాయం చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. కేసును సీబీఐతో విచార‌ణ చేయిస్తామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చి మోసం చేసింద‌న్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా ఉండ‌గా ఉద్యోగం, న‌గ‌దు, ఇంటి స్థ‌లం, పొలం ఇచ్చిన విష‌యాన్ని గుర్తుచేశారు. గిరిజ‌నుల‌కు న్యాయం చేయ‌క‌పోగా బ‌న‌గాన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఎంపీపీని గృహ‌నిర్బంధం చేసి వేధించార‌ని, మాచ‌ర్ల నియోజ‌కవ‌ర్గంలో ఒక గిరిజ‌న స‌ర్పంచ్ జెండా ఆవిష్క‌ర‌ణ చేయ‌కుండా టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా ఉండ‌గా డీబీటీ, నాన్ డీబీటీల ద్వారా రూ. 19,471 కోట్ల మేర గిరిజ‌నుల‌కు ల‌బ్ది చేకూర్చార‌ని చెప్పారు. గిరిజ‌నుల‌కు మేలు జ‌ర‌గాలంటే మళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ని సీఎం చేసుకోవాల‌ని తీర్మాణం చేశారు. 

ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర, వైయ‌స్ఆర్‌సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయణ మూర్తి, పార్టీ నాయకులు రామావత్ కృష్ణ నాయక్, పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఏందేటి వెంకట సుబ్బయ్య , ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాండ్లవత్ శ్రీనివాసుల నాయక్, లంబాడా నాయకులు కోటేశ్వర నాయక్, మాచర్ల రవి నాయక్, చంద్ర నాయక్, డాక్టర్ గోపి నాయక్, చితురి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top