అసలైన మెంటల్‌ - సైకోలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లే..!

మీడియా స‌మావేశంలో  వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే  మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్  

 ప్రజలకు మంచి చేసిన ముఖ్యమంత్రి సైకో ఎలా అవుతారు..?

మోదీ, పవన్‌లను నాడు తిట్టి.. నేడు పొగడటంలో మీ కూటమి పొత్తు గుట్టేంటి..?

వైజాగ్‌స్టీల్‌ప్లాంట్, ప్రత్యేకహోదాపై బీజేపీతో ఏం చెప్పించదలిచారు..?

ప్రజలకు మీరేం చేశారో చెప్పుకోలేక జగన్‌గారిని తిట్టడంపై సిగ్గుపడాలి

రేపటి ఎన్నికల్లో కూటమి నేతలకు రాజకీయ సమాధి ఖాయం

ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌ స్పష్టీకరణ

చంద్రబాబు, పవన్‌లు ఊగిపోతూ రెచ్చగొడితేనే.. వైయ‌స్‌ జగన్‌ గారిపై హత్యాయత్నం జరిగింది

మంగళగిరిలో వైయ‌స్‌ఆర్‌సీపీ నేత మేకా వెంకటరెడ్డి హత్యకు కారణం లోకేశే..

కూటమి ఓడిపోతుందని టీడీపీ అంతర్గత చర్చల్లోనే అంగీకరించారు

టీడీపీ ఎన్‌ఆర్‌ఐల మనీ రాజకీయాలపై ఎలక్షన్‌ కమిషన్‌ సూమోటో కేసు పెట్టాలి

టీడీపీ ఎన్‌ఆర్‌ఐల మనీ రాజకీయాల పట్ల ప్రజలు అప్రమత్తమవ్వాలి

ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌

తాడేప‌ల్లి:  అసలైన మెంటల్‌ - సైకోలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లే..! అంటూ వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే  మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్ మండిప‌డ్డారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవశాలి గా ఒకతను చెప్పుకుంటే, ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానంటూ మరొకతను చెప్పుకుంటూ ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం చాలా బాధాకరమ‌న్నారు. తాడేపల్లిలో వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. 

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల విషం కక్కే ప్రసంగాలుః
నారా చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్‌లు సభల్లో మాట్లాడుతున్న భాష తీరు చాలా విడ్డూరంగా ఉంది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవశాలి గా ఒకతను చెప్పుకుంటే, ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి వచ్చానంటూ మరొకతను చెప్పుకుంటూ ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం చాలా బాధాకరం. వీళ్లు రాష్ట్రానికి మేలు చేసే అంశాల గురించి మాట్లాడుతారా..? అంటే, అది వాళ్ల ప్రసంగాల్లో ఎక్కడా వినిపించడు. మరి, పొత్తు పెట్టుకుని ఎన్‌డీఏ భాగస్వాములుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టులను ఏమైనా తెస్తారని చెబుతారా..? అంటే అదీలేదు. కేవలం, జగన్‌మోహన్‌రెడ్డి గారిని దూషించడానికి మాత్రమే వారి ప్రసంగాలు రాసుకుంటున్నారు. నోటికి పట్టరాని విధంగా తిడుతున్నారు. సైకో అంటూ ఏవేవో బూతులు పదేపదే మాట్లాడుతూ విషం కక్కుతున్నారు. 

ఇంగితజ్ఞానం లేని చంద్రబాబుః
చంద్రబాబుకు, వయసు పెరిగి మైండ్‌ దొబ్బిందా..? నువ్వు రాజకీయాల్లో ఇంకా ఎలా కొనసాగుతున్నావో నీకైనా అర్ధమౌతుందా..? రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు నీ నుంచి ఆశిస్తున్నదేంటి.? నువ్వు మాట్లాడే తీరేంటీ..?ఒక ప్రతిపక్ష నాయకుడుగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా.. గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం చేశావు..? 2014లో ఇదే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ఏం చేశావు..? భవిష్యత్తులో ఏం చేస్తావు..? అనే అంశాలపై ప్రజలకు స్పష్టతనివ్వాల్సిన నాయకుడివి నువ్వు.. మా నాయకుడు జగన్‌ గారిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటావా..? కనీసం, ప్రజల ముందు మాట్లాడే భాషపై న
మీకు ఇంగితజ్ఞానం లేదా..? అదే నీ మాదిరిగా మేమూ మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా.? మీ మాటలు, ప్రవర్తనకు ప్రజలు అసహ్యించుకుంటున్నార ని తెలుసుకో.. 

అసలైన మెంటల్‌ - సైకో చంద్రబాబే..ః
ఈ రాష్ట్ర రాజకీయాల్లో అసలైన సైకో ఎవరు..? మీకు మెంటల్‌ ఎక్కి  ఆ ఫ్రస్టేషన్‌లో ప్రజల ముందుకొచ్చి ఏం మాట్లాడాలో తెలియక పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. నిన్నటిదాకా వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్న వరప్రసాద్‌గారిని మీరే బీజేపీలోకి పంపి.. ఆయనకు టిక్కెట్‌ ఇప్పించాడు. కరోనా కూడా నేను తెచ్చిందేనని చెప్పుకున్న మనిషి ఎవరు..? నువ్వు కాదా..?. 
దీన్ని బట్టి మెంటల్‌- సైకో ఎవరు..? 
  నీ పార్టీ సింబల్‌ సైకిల్‌ పోవాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు..? నువ్వే కదా..? ప్రజల్లో ఆదరణ కోల్పోయి.. ఎన్నికల్లో గెలవలేక నువ్వు మెంటల్‌గా మారావు. సైకోగా ప్రవర్తిస్తున్నావు. ఇది యథార్థం. నీ పార్టీ నేతలకూ, నీ చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలిసినా నీకు చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. 

మంచి చేసినోడిని సైకో అంటారా..?
– మంచి చేసే వాడ్ని సైకో అంటారా..?
– ముఖ్యమంత్రి సైకో అయితే పేదల కోసం ఇంత చేస్తారా?.  పేదల కుటుంబాల్లో పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదివిస్తారా..?
– ప్రభుత్వ స్కూళ్లను నాడు-నేడు పేరిట ఆధునీకరిస్తారా..? వారు చదువుకు అవసరమైన పుస్తకాలు దగ్గర్నుంచీ దుస్తులు, బూట్లు పంపిణీ చేస్తారా..? జగనన్న గోరుముద్ద వంటి పోషకాహారం పిల్లలకు పెడతారా..?
– కార్పొరేట్‌ విద్యకు తలదన్నే ప్రభుత్వ విద్య ఏ రాష్ట్రంలోనైనా చూశారా..? 
– గతంలో ఢిల్లీ మోడల్, కేరళ మోడల్‌ విద్య గురించి చెప్పేవాళ్లు. ఇవాళ దేశంలోనే ఏపీ మోడల్‌ విద్యావిధానాల గురించి ఎక్కడచూసినా చర్చ జరుగుతున్న విషయం తెలియదా..?
– నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ పేదలను అక్కునజేర్చుకుని వారి జీవనప్రమాణాల మెరుగుదలకు రూ.2.75 లక్షల కోట్లు డీబీటీ లబ్ధిని అందించిన వ్యక్తి సైకో అవు తాడా..? 
– పేదోడికి వైద్యం ఖరీదు కాకూడదని.. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకూ వైద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యం అందించే వ్యక్తి సైకో అవుతాడా..?
– పేదోడు నిలువ నీడ లేకుండా ఉండరాదంటూ.. అద్దెలభారంతో మగ్గేవారికి సొంతింటి కల నెరవేర్చిన వాడు సైకో అవుతాడా..? 
– ఆసరా, చేయూత వంటి పథకాలతో మహిళలు తమ సొంత కాళ్ల మీద తాము నిలబడేలా పనిచేసే ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అంటారా..?
– వృద్ధులు, వింతతువులు, విభిన్నప్రతిభావంతులకు ప్రభుత్వ పింఛన్‌ సొమ్ము రూ.3వేలు నెలలో మొదటి తేదీనే ఇంటికి తెచ్చి అందిస్తోన్న వ్యక్తిని సైకో అంటారా..? 
– వీటన్నింటినీ పైసా లంచం లేకుండా ఇంటి గడపల దగ్గరకే తెచ్చి అందించే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతుభరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టి.. దేశవ్యాప్తంగా ఆదర్శమైన ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు సైకో అంటారా..? .
పెత్తందార్లకు ప్రతినిధిగా పనిచేస్తున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లే అసలైన సైకోలు.

పరిపాలన సమర్ధుడు జగన్‌ గారుః
 ఆంధ్రరాష్ట్రాన్ని పరిపాలించే సమర్ధుడు శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గారు. ఇవాళ ఎన్నికల ప్రచారంలో మీరేం మాట్లాడుతున్నా రో.. మా జగన్‌ గారు ఏం చెబుతున్నారో ప్రజలంతా చూస్తున్నారు. నీ మార్కు పాలన ఏమీలేదు కనుకే, మీరేం చెప్పుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిష్షింగ్‌ హార్బర్లు, 17 కొత్త మెడికల్‌ కాలేజీలు, ఐటీ కంపెనీలు తెచ్చింది మా జగన్‌ గారు. పోర్టు బేస్డ్‌ టౌన్‌షిప్‌లు వచ్చేందుకు మా నాయకుడు అనేక ప్రణాళికలు చేస్తున్నారు. యువతకు ఉద్యోగాలు రావడానికి అనేక మార్గాలను చూపిస్తోంది మా నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి గారు. గత ఐదేళ్లల్లో జీఎస్‌డీపీ, జీడీపీ పెంచే విధంగా పనిచేసింది కూడా మా జగన్‌ గారే.. కేంద్రం ఇచ్చిన నివేదికలే ఇందుకు నిదర్శనం. మరి, నీ 14 ఏళ్ల హయాంలో మీరేం చేశారు..? 

ఓటమి తప్పదనే ఫ్రస్టేషన్‌తో కుట్రలు చేస్తారా..?ః
ప్రజలు చంద్రబాబును ఎప్పుడో మరిచిపోయారు. నీ పార్టీ ఆఫీసులోనే 147 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎత్తిపోయిందని సర్వేలు వివరించుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. ఓటమి పాలవుతున్నామనే వాస్తవాలను జీర్ణించుకోలేకనే కదా.? హత్యా రాజకీయాలు చేయాలి. దాడులకు పాల్పడాలంటూ మీరు ఆర్నెల్ల కిందట్నుంచే కుట్రలు చేస్తుంది..? మీరెంత రెచ్చగొట్టినా.. మేము చాలా సంయమనంతో ఉన్నాం కదా..? మా కార్యకర్తలను కూడా కాళ్లు గడ్డాలు పట్టుకుని వాళ్లెంత రెచ్చగొట్టినా ఆవేశపడొద్దని మేము బతిమాలు కుంటున్నాం. ప్రజల మనసు గెలవడమే మాపార్టీ ముందున్న లక్ష్యం. కనుకే, మా అధినాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నాం. అదే మేము కూడా మీలాగా ప్రవర్తించి .. మీవంటి భాష మాట్లాడితే నువ్వు, పవన్‌కళ్యాణ్‌ ఎక్కడా తిరగలేరనేది గ్రహించండి.  

తిట్లు తప్పితే.. మీరేం చేశారు?
ఎన్నికల క్షేత్రంలో ప్రజలకు కావాల్సింది ఏంటి..? మీరు మమ్మల్ని .. మేము మిమ్మల్ని తిట్టి కొట్టడమా..? అది ఎన్నికల అజెండా సబ్జెక్టు కాదుకదా..? ఐదేళ్ల పాలనలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేసిన మేలేంటో చెబుతూ.. భవిష్యత్తును ఆశీర్వదించమని మా అధినాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు కోరుతున్నారు. అలాగే, మీరు కూడా గతంలో ప్రజలకు చేసిందేంటో చెప్పి ఓట్లు అడగాలి. అలాకాకుండా,  చెప్పుకోవడానికి ఏమీలేక ప్రసంగించినంతసేపూ మా నాయకుడ్ని తిట్టడంతో ఏం సాధిస్తారు..? అందుకే, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారని అర్ధం చేసుకోండి. 

తిట్టిన నోటితోనే పొగుడుకునే మీ సంసారం మాటేంటి..?ః
బీజేపీని, నరేంద్రమోదీని నిన్నటిదాకా తీవ్రంగా విమర్శించిన నోటితోనే ఇప్పుడు పొత్తు పేరిట పొగుడుతున్నారు. అదేవిధంగా పవన్‌కళ్యాణ్‌ను , అతని తల్లిని కూడా అసభ్యకరమైన పదజాలంతో తిట్టింది మీరే.. ఇవాళ మీకు ఆయన అండాదండా అంటూ పొగుడుకుంటున్నారు. ఇలా తిట్టుకుంటూ పొగుడుకుంటూ ఎవరు ఎవరితో సంసారం చేస్తున్నారో.. ప్రజలంతా చూస్తున్నారు కదా..? అందుకే, ప్రజలు మీరంటే నమ్మడం లేదు.

స్టీల్‌ప్లాంట్, ప్రత్యేకహోదాపై బీజేపీతో ఏం చెప్పిస్తారు..?ః
బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్‌డీఏ భాగస్వాములం మేము అని చెప్పుకుంటున్నారు. మరి, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై అదే బీజేపీ నోటితో ఏమైనా చెప్పిస్తున్నారా.? ప్రత్యేకహోదాపై ఏమైనా మాట్లాడిస్తున్నా రా..? ఇలాంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరిగేలా మీరు వ్యహరించాలి కదా..?  

కూటమి గెలవదని కోనేరు సురేష్‌ మాట నిజంకాదా..?ః
 చంద్రబాబు ఫొటో చూపిస్తే.. ఈ రాష్ట్ర ప్రజలు ఓటు వేయరని తేల్చుకున్నాకనే పవన్‌కళ్యాణ్‌ను తీసుకొచ్చి నిలబెట్టాలని అనుకుంది..? ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌ ప్రభావం కూడా ప్రజల్లో కనిపించడం లేదని తెలుసుకున్నాకనే కదా.. ఎన్‌డీఏతో పొత్తు పెట్టుకుని ఒకట్రెండు శాతం ఓటుబ్యాంకు సంపాదించుకోవాలనే ఆలోచనతో కూటమి గట్టుకోలేదా..? మీరు ముగ్గురు కలిసినా.. ఇంకా మూడు, నాలుగు శాతం వెనకబడి పోతున్నామని.. గెలవలేకపోతున్నామని తెలుగుదేశం ఎలక్షన్‌ సెల్‌ కో ఆర్డినేటర్‌ కోనేరు సురేష్‌  విశ్లేషించింది నిజం కాదా.? ఆ విశ్లేషణ ఫలితాల్ని తెలుసుకున్నాక లబోదిబోమని తలకొట్టుకున్నారుగా..?  ఇంకా ఏదొకటి చేయండి.. మనం ఏమీ చేయకుంటే, జగన్‌ గారు చెప్పుకునే వై నాట్‌ 175 ఖాయమౌతుందని మీ అంతర్గత సమావేశాల్లో మీరే చర్చించుకుంటున్నది నిజం కాదా..?

ఆ అక్కసుతోనే జగన్‌ గారిపై హత్యాయత్నానికి బరితెగించారుః
ఇక, ఎటూ ఎన్నికల్లో గెలవలేమని తెలిసి ఆ అక్కసుతోనే .. రాజకీయ ప్రత్యర్థిని రాజకీయంగానే ఎదుర్కోలేక.. దాడులకు దిగి హత్యాయత్నానికి బరితెగించారు. జగన్‌మోహన్‌రెడ్డి గారిపై హత్యాయత్నం జరిగాక.. కనీస సానుభూతి చూపించని మీ అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి నానా రకాలుగా వ్యంగంగా మాట్లాడారు. కోడికత్తి డ్రామా 2.0 అన్నారు. మాకు మేమే దాడి చేసుకున్నామంటూ ప్రెస్‌మీట్లు పెట్టడంపై మీకు బుద్ధుందా..? మైండ్‌ ఉందా..? అంత బలంగా రాయితో కొట్టించుకుని కన్ను పోగొట్టుకుంటారా..? పర్మినెంట్‌ డ్యామేజీ చేసేసుకుంటారా..? మీరు మాట్లాడే విధానం ప్రజలకు అర్ధం కాదనుకుంటున్నారా..? ఈరోజుకు అయ్యో.. మనం జగన్‌మోహన్‌రెడ్డి గారిపై హత్యాయత్నానికి పాల్పడ్డామనేది మీ మనసుకు తెలియదా..? మీ టీడీపీ మనుషులే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు కదా..? 

లోకేశ్‌ హత్యారాజకీయానికి వెంకటరెడ్డి బలిః
మంగళగిరిలోనూ చంద్రబాబు కొడుకు నారా లోకేశ్‌ ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, అత్యంత వివాదరహితుడైన మేకా వెంకటరెడ్డి గారిని దారుణంగా చంపారు. ఆ నియోజకవర్గంలో ప్రజలంతా ఆయన మాట వింటారని.. తమకు నెగిటివ్‌ అవుతుందని టీడీపీ నాయకులు, లోకేశ్‌ కుట్రగట్టి మరీ వెంకట రెడ్డి గారిని హత్య చేశారు. ఆయన మీకేం అన్యాయం చేశాడు..? మీ రాజకీయ దాహానికి నిండుప్రాణాన్ని బలితీసుకున్నారు. మీ దుర్మార్గమైన రాజకీయ కుట్రలను మంగళగిరి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 

రెచ్చగొట్టి ప్రజల్ని నాశనం చేసేలా కుట్రలుః
 మరీ, ఇంత విధ్వేషపూరితమైన హత్యా రాజకీయాలు నడుపుతారా..? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఎలా మార్చాలని మీరు అనుకుంటున్నారా..? ఇన్నాళ్లలో లేని హత్యారాజకీయాలను ఇవాళ మీరు ఓడిపోతున్నారని చూపించదలుచుకున్నారా..? ప్రజల్ని భయ భ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకుంటున్నారా..? మైకు పట్టుకోగానే ఊగిపోయి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. వారిలో విధ్వేషాలను ఉసిగొల్పి ప్రజల జీవితాలను సర్వనాశనం చేసేలా మీరు ప్రవర్తిస్తున్నారు. బాధ్యతారహితంగా ఉన్న మీ ప్రసంగాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 

ఎన్‌ఆర్‌ఐల మనీ రాజకీయాలపై.. అప్రమత్తంగా ఉండాలిః
ఇక్కడ పుట్టి విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు జన్మభూమి కోసం ఏదైనా చేయాలని తపనతో ఉంటారు. అలాంటి ఎన్‌ఆర్‌ఐలను కూడా ఈ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు కలిసి విషప్రచారంతో మారుస్తారా..? వాళ్లను ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి కులాల్ని రెచ్చగొట్టి మీ డబ్బంతా ఇక్కడకు తెచ్చి ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేలు పెట్టండి.. ఒక్కొక్కరు పది వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబాలను మార్చాలని ప్రచారం చేస్తారా..? 

టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కో ఆర్డినేటర్‌ జయరామ్‌ చేస్తున్న ప్రచారమేంటి..? వైఎస్‌ఆర్‌సీపీ కుటుంబాల్లో ఉండే వారిని ‘వెధవలు’ అంటూ సంభోదిస్తూ.. వారిని మార్చమంటాడా..? (టీడీపీ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కో ఆర్డినేటర్‌ కోమటి జయరామ్‌ ప్రసంగ వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు.)
చంద్రబాబు మరీ ఇంత అనైతిక రాజకీయం చేస్తారా..? ఎన్‌ఆర్‌ఐలు గ్రామాలకు వచ్చి ఇలాంటి ప్రచారం చేస్తే ప్రజలు మోసపోవద్దు. వాళ్ల విష ప్రచారాలపై అప్రమత్తమై ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి ఘటనలపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు కూడా సూమోటో కేసులు ఫైల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈవిధమైన ఎత్తుగడలకు ప్రయత్నించే నాన్‌ లోకల్‌ ఎన్‌ఆర్‌ఐలపైన మేము పోలీసు కేసులకు వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల రాజకీయ కుట్రలన్ని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. రేపటి ఎన్నికల్లో వారి పార్టీలకు రాజకీయ సమాధి కట్టడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు. 
–––––––––

Back to Top