చంద్రబాబు మొసలి కన్నీరుని ప్రజలు నమ్మరు

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ  

తాడేప‌ల్లి: చంద్రబాబు మొసలి కన్నీరుని ప్రజలు నమ్మరని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిప‌డ్డారు. పెన్షన్స్ దారులు గత మూడు రోజులుగా ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబు,నిమ్మగడ్డ రమేష్.పెన్సన్లపై నిమ్మగడ్డ రమేష్ పై ఫిర్యాదు చేయించింది చాలక చంద్రబాబు డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు. శుక్ర‌వారం వాసిరెడ్డి ప‌ద్మ మీడియాతో మాట్లాడారు.

వాసిరెడ్డి ప‌ద్మ ఏమ‌న్నారంటే..

 • చంద్రబాబు మొసలి కన్నీరుని ప్రజలు నమ్మరు.
 • చంద్రబాబు,పచ్చమీడియా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు.
 • అవ్వా,తాత లకి ప్రతి నెలా మొదటి తేదీనే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వారిని కుటుంబ సభ్యుల్లా చూసే వ్యక్తి జగన్.
 • వైయస్ రాజశేఖరరెడ్డి,వైయస్ జగన్ ల హయాంలో మాత్రమే శాచ్యురేషన్ బేసిస్ పై పెన్సన్ లు మంజూరు చేస్తున్నారు.
 • చంద్రబాబు హయాంలో ఎవరైనా చనిపోతే మాత్రమే కొత్త వారికి పెన్షన్ వచ్చేది.
 • పెన్షన్ dbt ద్వారా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కి లేఖ రాసింది పురేంద్వేశరి,నిమ్మగడ్డ కాదా..
 • వృద్దుల పెన్షన్ కోసం పడిగాపులకి బాధ్యత చంద్రబాబుది.ప్రజల మీద చంద్రబాబు పగ పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు.
 • వాలంటీర్ వ్యవస్థని కావాలని తప్పించి 50మంది వృద్ధుల మరణానికి కారణం చంద్రబాబు ఆయన కూటమి.
 • మా ప్రభుత్వం వృద్ధులను అక్కున పెట్టుకుంది .టీడీపీ అధికారంలోకి వస్తే వృద్ధులను ఇలానే చంపుతారు.
 • రాష్ర్టంలో ఏ వర్గం మీద కూటమికి ప్రేమ లేదు.ఇంటి ఇంటికి పెన్షన్ ఇవ్వకూడదు బ్యాంకు ద్వారా ఇవ్వండని చెప్పి...జగన్ గారి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు..
 • ప్రజలు మెచ్చేలా పరిపాలన ఎలా చేయాలో వైయస్ జగన్ దగ్గర నుండి చంద్రబాబు,పవన్ లు నేర్చుకోవాలి.
Back to Top