తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (31.07.2025) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జైల్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో వైయస్ జగన్ మాట్లాడనున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు, అక్కడ నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి, అనంతరం కాకాణి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అక్కడి నుంచి నెల్లూరు సుజాతమ్మ కాలనీకి చేరుకుని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.