బ్రిటిష్ పరిపాలనను తలపిస్తున్న కూటమి ప్రభుత్వం  

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితా రెడ్డి

నెల్లూరు:  కూట‌మి ప్ర‌భుత్వం బ్రిటిష్ పరిపాలనను తలపిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితా రెడ్డి మండిప‌డ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం చూస్తుంటే రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతుంది. వైయస్సార్  కడప జిల్లా పులివెందులలో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నాయకుడు వేల్పుల రాముపై నేతలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.... 

ప్రజాస్వామ్యంలో ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడికి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తమ అధికారంతో ప్రజలను భయాందోళనలకు గురిచేసి,  గెలవాలని చూస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు ప్రజలే బుద్ధి చెబుతారు. 

ఎన్నికల స్వేచ్ఛ ఆటంకం కలిగించే వారిపై ఎన్నికల కమీషన్  తక్షణమే చర్యలు తీసుకొని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. దాడి చేసిన వారిని గుర్తించి,  పోలిసులు కేసు నమోదు చేసి, పులివెందుల జెడ్పిటిసి ఎన్నికలను ప్రజాస్వామ్య బద్ధంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కోరుతున్నాం.

Back to Top