మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పర్యటనలో భద్రత పెంచాలి 

వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి ఇన్‌చార్జ్  భూమ‌న అభిన‌య్‌రెడ్డి డిమాండ్‌

తిరుప‌తి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లో భ‌ద్ర‌త పెంచాలని వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి ఇన్‌చార్జ్  భూమ‌న అభిన‌య్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధ‌వారం భూమన అభినయ్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరుపతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నూకతోటి రాజేష్, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ...`మాజీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనల్లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం క‌నిపిస్తోంది. రేపు నెల్లూరు జిల్లాలో మా నాయకుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు భద్రత తగ్గించడంపై అనుమానాలు ఉన్నాయి. దేశంలో ఏడాదికే ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోవడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం పర్యటనలో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి భద్రత  విష‌యంలో నిరక్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. రేపు నెల్లూరు జిల్లా లో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు భద్రత పెంచాలి` అని భూమన అభినవ్ రెడ్డి  డిమాండ్ చేశారు. 

Back to Top