కుట్రలకు గడ్డ నిమ్మగడ్డ రమేష్.

 వైయ‌స్ఆర్‌సీపీ  అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ 

తాడేప‌ల్లి: పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు,పవన్ కల్యాణ్ లతో పాటు పచ్చమీడియా విషం కక్కుతోంద‌ని  వైయ‌స్ఆర్‌సీపీ  అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిప‌డ్డారు. ఈ కుట్ర‌ల‌కు అడ్డా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 • పండుటాకుల మీద బిజేపి,టిడిపి,జనసేన కూటమి నేతలు క్రూరంగా వ్యవహరిస్తున్నారు
 • పెన్షన్ లబ్దిదారులపై బ్యాంక్ ఖాతాల్లో వేయాలని నిమ్మగడ్డ రమేష్ చౌదరి లేఖ రాసింది నిజం కాదా.
 • వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వొద్దని చెప్పి బ్యాంక్ ఖాతాల్లో వేయాలని నిమ్మగడ్డ స్వయంగా కోరారు.
 • కూటమి నేతలు అంతా నిమ్మగడ్డ రమేష్ ద్వారానే కుట్రలకు అధ్యం పోశారు
 • పురంధరేశ్వరి,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ అంతా కలిసే నిమ్మగడ్డ రమేష్ తో ఈ వ్యవహారం నడిపారు.
 • ఇప్పుడు అవేమి తెలియనట్లుగా డ్రామాలు ఆడుతున్నారు.
 • పెన్సన్లు ఇంటివద్ద చెల్లించకుండా అడ్డుకుంది చంద్రబాబే అనేది రాష్ర్టంలోని ప్రతి ఒక్కరికి తెలుసు.
 • గత రెండు రోజులుగా బ్యాంకుల వద్ద పండుటాకులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం
 • గత నెలలో పదుల సంఖ్యలో వృధ్దులు చనిపోవడానికి కారణం చంద్రబాబే.
 • తిరిగి మేనెలలో కూడా చంద్రబాబు వృద్దుల ప్రాణాలతో పరాచకాలు ఆడుతున్నారు.
 • పెన్షన్ల పంపిణీ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు బాధ్యత అంతా కూటమిలోని మూడు పార్టీలదే.
 • జగన్ గారిపై బురదచల్లుతున్న పచ్చమీడియా రమేష్ రాసిన లేఖలు,బ్యాంక్ అకౌంట్లలో పెన్సన్ వేయమన్న రమేష్ మాటలు గుర్తుకురావడంలేదా.
 • కుట్రలకు గడ్డ నిమ్మగడ్డ రమేష్.
 • ఎండవేడి గాలులకు,క్యూలలో నిలుచుని ఎవరైనా వృద్దులు మృతి చెందితే వారందర్ని చంద్రబాబు,రామోజిరావులే హత్య చేశారని భావిస్తాం.
   
Back to Top