వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్న నరహంతకుడు చంద్రబాబు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అవ్వాతాతలకు చేసిన పాపానికి ఉసురుకొట్టుకుని పోవడం ఖాయం

బాలకృష్ణ స్క్రిప్టు చదవడమే తప్ప.. బుర్రాబుద్ధీలేనోడు 

జగన్‌ గారు తెచ్చిన విప్లవాత్మక విద్యా సంస్కరణలపై అవగాహనలేనోడు

స్కూళ్లకు రంగుల్ని చూసినోళ్లు విద్యావిధానం తెలుసుకుంటే మంచిది

నాడునేడు, ఇంగ్లీషు మీడియం, బైజ్యూస్, ఐబీ విధానం మా మార్క్‌ 

ఇలాంటి  ఆలోచనలు నీ బావ బుర్రకెందుకు రాలేదో అడుగు.. బాలకృష్ణ..?  

ఏపీ విద్యావిధానంపై పీఎం అడ్వైజరీబోర్డు, నీతిఅయోగ్‌ ప్రసంశలే మాకు కొలమానం

జగన్‌గారు సీఎం కాకుంటే నష్టపోయేది పేదలేనని అందరికీ తెలుసు

కాబట్టి.. రాష్ట్రంలోని 175 చోట్లా గెలుపు వైఎస్‌ఆర్‌సీపీదే..

మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ  

విజ‌య‌న‌గ‌రం: వృద్ధుల ప్రాణాలతో ఆడుకుంటున్న నరహంతకుడు చంద్రబాబు అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు అతిథిగృహంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ  ఏమన్నారంటే..ః

సినిమా స్క్రిప్టు ప్రసంగాలకు జనం నవ్వుకుంటున్నారుః
ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలకృష్ణ నిన్న చీపురుపల్లి, విజయనగరంలో మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కాగితాలు పట్టుకుని కిందపడీ మీదపడి చూసుకుని చదువుకుంటూ ప్రసంగించడాన్ని అందరూ చూశారు. సినిమాల్లో స్క్రిఫ్టు చదివినట్టుగానే రాజకీయ ప్రసంగాలనూ అదే విధంగా చదువుకుంటూ పోతున్నాడు. ఆయనకు జీవితం గురించి గానీ.. రాజకీయాలు, రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై గానీ ఏమాత్రం అవగాహన లేదని నిన్నటి ప్రసంగంతో అందరికీ అర్ధమైంది. ఉత్తరాంధ్ర ప్రాంతం, విజయనగరం జిల్లా భౌగోళిక పరిస్థితులపై నీకేం అవగాహన ఉంది బాలకృష్ణ..? నీలాంటి సెలబ్రిటీలు వస్తుంటారు. పోతుంటారు. నీలాంటోళ్లు సినిమాల్లో చేశారు కనుక చూద్దామని వచ్చే జనం కొంత ఉర్రూతలూగారని.. నువ్వు కూడా ఊగిపోయి నోటికేదొస్తే అది మాట్లాడితే ఎలా కుదురుద్ది..? నీ మాటలు, నీ భాషను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అది తెలుసుకో.. 

స్కూళ్ల భవనాలకు రంగులేస్తే తప్పేంటి...?
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, విద్యాశాఖ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు..? తెలియకపోతే నీ స్నేహితులు ఈటీవీ, ఏబీఎన్‌ సంస్థల అధినేతలను అడిగి తెలుసుకో.. లేదంటే, ఆ ఛానెళ్లల్లోనే విద్యా శాఖ మీద చర్చ పెట్టించు. నువ్వొక వైపు.. మేమొక వైపు కూర్చొని చర్చిద్దాం. అప్పుడు విద్యావ్యవస్థ గురించి చాలా విషయాలు నువ్వు నేర్చుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్టు అని మేమెలా చెబుతున్నామంటే.. ఆయన బావ చంద్రబాబు మాదిరిగానే ఈయనా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ స్కూళ్లకు రంగులేశారంటున్నాడు. అవును.. స్కూళ్ల భవనాలకు రంగులేస్తే తప్పేంటి..? మరి, నీ బావ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పాత, శిథిల భవనాలను పట్టించుకోలేదు కదా..? స్కూల్‌ బయట గోడలను కాకుండా .. లోపలికి స్కూలు పరిసరాలు ఎలా ఉన్నాయి..? విద్యార్థులకు విద్యాబోధనలో వచ్చిన మార్పులను ఎవరినైనా అడిగితేనే.. కళ్లు పెట్టుకుని చూస్తేనో తెలుస్తోంది. అంతేగానీ, గోడలకు రంగులేసినంతమాత్రానా పిల్లలకు చదువు వస్తుందా..? అనే మాటలేంటి..? బుద్ధుండే మాట్లాడుతున్నారా..? 

విప్లవాత్మక విద్యా సంస్కరణల సృష్టికర్త జగన్‌గారుః
గడచిన ఐదేళ్ల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి ఇంగ్లీషు మీడియం బోధనా విధానానికి  శ్రీకారం చుట్టి గొప్ప మార్పునకు నాందిపలికారు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడో తరగతి నుంచే టోఫెల్‌ శిక్షణతో ఇంగ్లీషు కమ్యూనికేషన్‌ గ్యాప్‌ రాకుండా పరీక్షలకు ప్రిపేర్‌ చేస్తున్నారు. గతంలో ఉన్నత చదువులు చదివాక ఏ విదేశాలకు వెళ్లే విద్యార్థులు మాత్రమే ప్రిపేరయ్యే పరీక్షలు ఇవి. అలాంటిది, ప్రభుత్వ విద్యావిధానంలో మన పిల్లలు మూడో తరగతి నుంచే ఏడు తరగతి వరకు ఒక స్థాయి.. ఆ తర్వాత పదోతరగతికి వచ్చేసరికి ఇతర దేశాల ఇంగ్లీషు యాక్సెంట్‌పై పూర్తిస్థాయి పట్టు సాధిస్తున్నారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో విద్యాబోధన అమలు చేయడం ఏపీ ప్రభుత్వ ప్రత్యేకత అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.

బైజ్యూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు, స్మార్ట్‌టీవీలతో..ః
 ప్రతీ మండల కేంద్రంలోనూ పదో తరగతి తర్వాత జూనియర్‌ కాలేజీల ఏర్పాటుతో పాటు వాటిల్లో చదివే విద్యార్థులకు యూనిఫాంతో పాటు పుస్తకాలు అన్నీ రకాల వసతులనూ ప్రభుత్వమే కల్పిస్తోంది. 8వ తరగతి నుంచి టెన్త్‌ వరకు విద్యార్థులకు ట్యాబ్‌లిచ్చి.. వారి సిలబస్‌ను బైజ్యూస్‌ సంస్థ ద్వారా అప్‌లోడ్‌ చేయించి ఆన్‌లైన్‌ క్లాసుల్ని ప్రవేశపెట్టాం. అదేవిధంగా నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ల ఆధునీకరణలో భాగంగా క్లాస్‌రూమ్‌లలో స్మార్ట్‌ టీవీల ఏర్పాటు చేశాం. టీచర్లకు ట్రైనింగ్‌ ఇప్పించి మరీ ఇంటారాక్టివ్‌ క్లాసుల విధానం నడుపుతోన్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐబీ విధానం అమలుః
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఎస్‌ఈఆర్‌టీ భాగస్వామ్యంతో ఐబీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టి అమల్లోకి తెస్తున్నాం. 2024–25 విద్యా సంవత్సరంలో మూడోతరగతి చదివే విద్యార్థి వరుసగా పన్నెండు సంవత్సరాలు అంటే, సీనియర్‌ ఇంటర్‌ వరకు ఐబీ సర్టిఫికేషన్‌ తో ఉన్నత చదువులు దేశ, విదేశాల్లో చదివే ఆస్కారం కల్పిస్తోన్నాము. 

సీబీఎస్‌ఈ సిలబస్‌తో 1000 స్కూళ్లుః
రాష్ట్రంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో ప్రస్తుతం 130 ప్రైవేటు పాఠశాలలు నడుస్తున్నాయి. అయితే, రాష్ట్రంలో ఉన్న 10వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1000 స్కూళ్లను సీబీఎస్‌ఈ సిలబస్‌తో నడిపించాలని ముఖ్యమంత్రి జగన్‌ గారు ఇప్పటికే నిర్ణయించారు. దీనికిగాను, ఒక్కసారిగా ఇన్ని పాఠశాలలు ఈ రాష్ట్రంలో వస్తున్నందున.. సీబీఎస్‌ఈ బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని కూడా ఈ రాష్ట్రంలో పెట్టడానికి సీబీఎస్‌ఈ యాజమాన్యం కూడా అంగీకరించిన సంగతి చెప్పడానికి గర్విస్తున్నాము. 

జగనన్న గోరుముద్దతో పౌష్టికాహారం అందజేస్తూ..ః
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఎప్పట్నుంచో కొనసాగుతూ ఉన్నప్పటికీ.. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కొనసాగుతోన్న పథకం ప్రత్యేకమైంది. కేంద్ర సహకారంతో కేవలం పప్పు, సాంబార్‌కే మధ్యాహ్న భోజనం పరిమితమైతే, అలా కాదంటూ జగన్‌ గారు అధికారంలోకొచ్చాక జగనన్న గోరుముద్ద పథకం కింద దాదాపు 12 రకాల వంటకాలతో రోజుకో మిల్లెట్స్‌తో పౌష్టికాహారాన్ని పిల్లలకు వడ్డిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో కులమతాలకతీతంగా, పేద, ధనిక వర్గాల పిల్లలనే తారతమ్యం లేకుండా గోరుముద్ద పథకం అద్భుతంగా అమలు జరుగుతోంది. స్కూల్‌ యూనిఫాం దగ్గర్నుంచీ పుస్తకాలు, బ్యాగ్, వారి కాళ్లకు బూట్లుతో సహా ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. 

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లుః
డిగ్రీ చదివే విద్యార్థులకు తాము తీసుకునే కోర్సులకు సంబంధించి ఆఖరి సంవత్సరంలో ఆర్నెల్లపాటు సంబంధిత కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌లు ఇప్పిస్తు న్నాం. ఇంజినీరింగ్‌ విద్యార్థులకూ మూడో సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్‌ కల్పించి.. అది పూర్తయ్యాక ఆయా కంపెనీల్లోనే నేరుగా ఉద్యోగాల్లో చేరే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం. ఇంటర్న్‌షిప్‌ సమయంలోనూ స్టైఫండ్‌ ఇచ్చి జాబ్‌ గ్యారెంటీ ఇచ్చే విధానం ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? ఇలాంటి ఆలోచన చంద్రబాబు బుర్రకు ఏనాడైనా పుట్టిందా.??

పేదల బాధలు నీకేం తెలుసు బాలకృష్ణ..?ః
మరి, ఇన్ని విద్యావ్యవస్థలో అమలవుతున్నాయని గానీ.. రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ ఎరుగని విధంగా పిల్లలు చదువుకుంటున్నారని నీకు తెలుసా బాలకృష్ణ..? మరి, నీ తండ్రి, నీ బావ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యావ్యవస్థలో వాళ్ల బుర్రలకు ఇలాంటి మంచి ఆలోచనలు తట్టలేదెందుకు..? నీ తండ్రి సంపాదించిన డబ్బుతోనే.. నువ్వు సినిమాల ద్వారా ఆర్జించిన డబ్బుతోనే జల్సాలు చేసుకుంటూ తిరుగుతావు. అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పేదవాడి తాలూకూ బాధలు, ఇబ్బందులు, వారి పిల్లల చదువుల సంగతి నీకేం తెలుస్తాయి..?

వచ్చే 15 ఏళ్లల్లో అన్నిచోట్లా ఏపీ విద్యార్థులకే అవకాశాలుః
ప్రస్తుతం రాష్ట్రంలో జగన్‌ గారు ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న విద్యాసంస్కరణల ఫలాలు రానున్న 15 ఏళ్ల తర్వాత ఏ స్థాయిలో ఉంటాయనేది మేధావులు ఆలోచన చేయాలి. దేశంలో ఏ కాంపిటేటివ్‌ పరీక్ష పెట్టినా.. దేశ విదేశాల్లో ఉద్యోగవకాశాల్లో చూసినా వాటిల్లో 50 శాతం మంది పిల్లలు మన రాష్ట్రం వారే ఉంటారు. మిగతా రాష్ట్రాల విద్యార్థులంతా కలిసి 50 శాతం ఉంటారు. ఇదీ ఈ రాష్ట్రంలో అమలవుతోన్న విద్యావిధానం. సినిమాల్లో స్క్రిప్టు బట్టీబట్టి నటించే నీకేం తెలుసు బాలకృష్ణ..? 

తండ్రి పేరుతో బతకడం తప్ప బుర్రలేనోడు బాలకృష్ణః
నాకు విద్యావ్యవస్థ గురించి ఏం తెలుసని అంటావా..? ఈ రాష్ట్రంలో అమలవుతోన్న విద్యావిధానాల గురించి ఒక విద్యాశాఖ మంత్రిగా ఇన్ని చెప్పాను కదా.. మరి, నీకున్న అవగాహనేంటి..? నువ్వు మాట్లాడే భాష ఎవరికైనా అర్ధమౌతుందా.? రాత్రి ఒకటి.. పగలు ఒకటి నీలా మాట్లాడటం మాకు చేతగాదు. తండ్రి పేరు చెప్పుకుని బతికే నువ్వు నా గురించి మాట్లాడుతావా.. నాన్సెన్స్‌. ఇవాళ దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యావిధానం బాగుందని ప్రధాని అడ్వైజర్‌బోర్డుతో సహా నీతిఅయోగ్‌ లాంటివి ఒప్పుకున్నాయి. ఇంతకన్నా మా ప్రభుత్వానికి, జగన్‌ గారికి వచ్చే ప్రశంసలేముంటాయి..?   

వృద్ధుల ప్రాణాల్ని తీసిన నరహంతకుడు చంద్రబాబుః
ఇవాళ రాష్ట్రంలో పింఛన్‌లు సకాలంలో అందక తీవ్ర వ్యయప్రయాసలతో వృద్ధులు అల్లాడిపోతున్నారు. నిన్న, ఇవాళ రాష్ట్రంలో ఐదారుగురు చనిపోయారు. వీళ్ల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న నరహంతకుడు చంద్రబాబు కాదా..? గడచిన ఐదేళ్లలో ప్రతీ నెలా మొదటి తేదీ తెల్లవారుజామున ప్రతీ అవ్వాతాత చేతిలో పింఛన్‌ పెట్టి వారి ముఖాల్లో నవ్వును చూసేవాళ్లం. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా అంత అద్భుతమైన పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని నడిపిన ప్రభుత్వం మాది. అలాంటిది, అవ్వాతాతల ముఖాల్లో నవ్వును చూసి జీర్ణించుకోలేని చంద్రబాబు అండ్‌ కో ఎలక్షన్‌ కమిషన్‌కు పిటీషన్లు పెట్టి వాలంటీర్లను దూరం చేశారు. ఈరోజు వృద్ధులను పింఛన్‌ తీసుకునేందుకు నానాపాట్లుకు గురిచేశారు. చంద్రబాబు, ఆయన ఉసిగొల్పిన పిటీషన్‌దారులు వృద్ధుల ఉసురు కొట్టుకుపోవడం ఖాయం. 

పేదలకు మేలు జరగాలంటే జగన్‌గారు సీఎం అవ్వాల్సిందేః
పెత్తందార్లకు నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తూ.. ఎన్నికల్లో లబ్ధిపొందాలని చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే సినిమా నటులను పూర్తిస్థాయిలో రంగంలోకి దింపి .. వారితో వచ్చీరాని మాటల్ని పలికిస్తున్నాడు. ఒకరేమో ఆవేశంతో ఊగిపోతూ రెచ్చిపోవడం, మరొకరేమో తెలుగుభాషను ఖూనీచేస్తూ అవగాహనలేని విధంగా మాట్లాడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు, వ్యూహాలు పన్నినా.. పేదల పక్షాన నిలిచి పెత్తందార్లతో పోరాడుతోన్న జగన్‌మోహన్‌రెడ్డి గారి గెలుపును ఆపడం కష్టతరం. ఆయన ముఖ్యమంత్రి కాకుంటే, నష్టపోయేది ఈ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలే. కనుక.. వారి మేలుకు పాటుపడే జగన్‌గారిని వారే ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు.  
 

Back to Top