చంద్ర‌బాబుపై ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

 అమ‌రావ‌తి: ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నచంద్రబాబు,పవన్ కల్యాణ్,ఈనాడు దినపత్రికలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన వైయస్సార్ సిపి.పార్టీ ఎంఎల్ ఏ మల్లాది విష్ణు,పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు నారాయణమూర్తి,లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డిలు ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల అధికారులకు అందచేశారు.

1.చంద్రబాబు నాయుడు ఈనెల 2 వతేదీన రాయచోటిలో ఎన్నికల ప్రచారసభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం.

2.పవన్ కల్యాణ్ ఈనెల రెండో తేదీన వైజాగ్ సౌత్,పాలకొండ ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపై వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం.

3.ఈనాడు దినపత్రికలో వైయస్సార్ సిపికి వ్యతిరేకంగా టిడిపికి అనుకూలంగా ప్రచురించిన న్యూస్ ఆర్టికల్స్ ను పెయిడ్ ఆర్టికల్స్ గాప్రచురించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

         అనంతరం పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ఉన్న నాలుగు అంశాలపై ఈసీకి పిర్యాదు చేశామన్నారు. డ్రామాలు ,నాటకాలతో ప్రజలను చంద్రబాబు తప్పుదారి పెట్టిస్తున్నారు. రాయచోటిలో టోపీ పెట్టి మైనారిటీలను చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేసారు. మైనారిటీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. 25 వేల కోట్లు మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ .న్యాయస్దానాలపై గౌరవం లేని చంద్రబాబు కోర్టు ఆదేశాలను కూడా దిక్కరిస్తున్నాడు.ఎన్నికల ప్రచారసభల్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నవరత్నాలను కాపీ కొట్టి పేర్లు మార్చి చంద్రబాబు  ప్రచారం చేసుకొంటున్నారు. సరైన విధానం లేని చంద్రబాబు  ఓట్లకోసం కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఎన్టీఏ కూటమి ఓ అతుకుల బొంత .ఓడిపోతామని కూటమి పార్టీలకు అర్ధం అయిపోయింది. నవరత్నాలపై దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు జేబు పార్టీలన్నింటికీ  స్క్రిప్ట్ ఒకే చోట నుంచి వెళుతోంది. గాజువాక ప్రజలు 2019 ఎన్నికల్లో పవన్ కి అన్నీ విరగ్గొట్టారు. పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టిన పాపం చంద్రబాబుదే అయినా సిగ్గు ఎగ్గూ లేకుండా ప్రభుత్వంపై నెపం వేస్తున్నారు అన్నారు.

    పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణమూర్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలపై ఈసీకి పిర్యాదు చేయడం జరిగిందన్నారు. ప్రచార సభల్లో పవన్ ఊగిపోతున్నాడు. అధికారంలోకి వస్తే మోకాళ్ళు ఇరగ్గొట్టి నడిపిస్తానని ఇతర పార్టీల నేతలపై వ్యాఖ్యానించాడు. పవన్ తీరు చూస్తే డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు.పవన్ వైజాగ్ ఆసుపత్రిలో చూపించుకొని ప్రచారానికి వెళ్ళాలని అన్నారు.

Back to Top