రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న కూటమికి ముస్లింలు గుణపాఠం చెప్పాలి

వైయస్‌ఆర్‌ సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి

నెల్లూరు: చంద్రబాబు కూటమిపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీ గుణపాఠం చెప్పాలన్నారు. కూటమికి ఓటు వేయడమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లేనని, టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనార్టీలను మోసం చేశాడని గుర్తుచేశారు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. ఇప్పుడు వేమిరెడ్డి, నారాయణ ద్వారా నెల్లూరు అర్బన్‌ అభ్యర్ధి ఖలీల్‌ను సంచులతో ఓడించాలని చూస్తున్నాడని మండిపడ్డారు.
 

Back to Top