ఢిల్లీలోనూ, గల్లీలోనూ మా విధానం ఒక్కటే..

హోదా తీర్మానాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టిన నీచ చరిత్ర చంద్రబాబుది

చంద్రబాబు హయాంలోనే జింక్‌ పరిశ్రమ ప్రైవేట్‌పరం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

విశాఖ:  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఢిల్లీలోనూ.. గల్లీలోనూ తమ విధానం ఒక్కటే.. అని, ప్లాంట్‌ పరిరక్షణ కోసం ధృడ సంకల్పంతో ఉన్నామని వైయస్‌ఆర్‌ కాగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. చంద్రబాబులా తమది రెండు నాల్కల ధోరణి కాదన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీలో హోదాను తాకట్టుపెట్టిన నీచ చరిత్ర చంద్రబాబుదని ధ్వజమెత్తారు. జింక్‌ పరిశ్రమ చంద్రబాబు హయాంలోనే ప్రైవేట్‌పరం అయిందని మండిపడ్డారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ తీర్మానం చేశారని గుర్తుచేశారు.
 

తాజా వీడియోలు

Back to Top