తాడేపల్లి: వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవడం దుర్మార్గమైన చర్య అని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే దాడులకు కుట్రలు జరుగుతున్నాయని, పోలీసులతో పాటు టీడీపీ గూండాలు దాడులకు దిగుతున్నారని తెలిపారు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఏపీలో వెన్నుపోటు పార్టీ దమనకాండకు దిగిందని మండిపడ్డారు. నారా లోకేష్‌ది యువగళం కాదని, రౌడీదళంగా మారిందని విమర్శించారు. పోలీసు వ్యవస్థను అత్యంత అసమర్థ వ్యవస్థగా మార్చేశారని, డీఎస్సీ అక్రమాలపై వైయస్ జగన్ ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. పాత కేసులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, దేవినేని అవినాష్‌పై కూడా రౌడీషీట్లు తెరిచారని, మాజీ కార్పొరేటర్లు, క్రియాశీలక కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని మనోహర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్టు చేశారో ప్రభుత్వం వెల్లడించాలని, ఇళ్లలో ఉన్న వారిని సైతం అక్రమంగా ఎత్తుకెళ్లడం అన్యాయమన్నారు. ప్రతిపక్షంపై రౌడీముద్ర వేస్తే ప్రశ్నించే వారు ఉండరని ప్రభుత్వం భావిస్తోందని, రేపు జర్నలిస్టులు, మేధావులపైనా రౌడీషీట్లు తెరిచే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌పై కూడా కేసులు ఉన్నాయని, మరి వారిపై కూడా రౌడీషీట్లు తెరుస్తారా అని ప్రశ్నించారు. వేధింపులకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. నంద్యాల నుంచి వచ్చిన ఒక టీచర్‌తో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, ఇక్కడి వారి పేర్లు నంద్యాల టీచర్‌కు ఎలా తెలుసని మనోహర్‌రెడ్డి ప్రశ్నించారు.