మెగా క్లస్టర్ల వల్లే చేనేతలకు మేలు

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
 

అమరావతి:  గత ప్రభుత్వం చేనేతలను చిన్నచూపు చూసిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో ఘనంగా చూపి నిధులు మాత్రం ఖర్చు పెట్టలేదని తెలిపారు. వ్యవసాయం తరువాత అధిక ప్రాధాన్యత చేనేతదే అని చెప్పారు. బ్లాక్‌ స్థాయి క్లస్టర్ల వల్ల ప్రయోజనం లేదని వివరించారు. మెగా క్లస్టర్ల వల్లే చేనేతలకు మేలు జరుగుతుందని చెప్పారు.

గత ఐదేళ్లలో రూ. 875 కోట్లు బడ్జెట్‌లో చూపించి రూ.473 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో చేనేతలకు రూ.320 కోట్లు రుణమాఫీ చేశారని తెలిపారు. 3 లక్షల కుటుంబాలకు ఆ రుణమాఫీ వర్తించిందని, ఆ రోజుల్లోనే రూ.150 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని  చెప్పారు. మా నియోజకవర్గంలో బోగస్‌ సహకార సంఘాలు ఏర్పాటు చేసి, గతంలో సభ్యులు లేకుండానే రుణాలు దుర్వినియోగం చేశారని తెలిపారు. వీటిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్‌ దర్యాప్తు చేపట్టాలని మంత్రిని కోరారు. నేతలన్న జీవితాలు బాగు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత కల్పించారని, సీఎంకు ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు తెలిపారు.
 

Back to Top