పేద ప్రజల ఆశలకు ప్రతిరూపంగా పాలన

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
 

అమరావతి: పేద ప్రజల ఆశలకు ప్రతిరూపంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించిన శాసన సభా పక్ష సమావేశం అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. మనం ప్రజా సేవకులం మాత్రమే అని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారన్నారు. పదవులు అన్నది హోదా కాదని, బాధ్యత అన్నారు. బాధ్యతతో కూడిన విలువలతో రాజకీయాలు చేయాలని, పేద ప్రజలు ఏం ఆశించి మనకు 151 స్థానాలు అందించారో వాళ్ల ఆశలకు ప్రతిరూపంగా మనం పని చేయాలని సీఎం సూచించినట్లు ఆర్కే తెలిపారు. మంత్రివర్గంలోకి 25 మందిని తీసుకోబోతున్నానని, అందులో కూడా రెండున్నరేళ్ల తరువాత కొత్తవారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని వైయస్‌ జగన్‌ తెలిపినట్లు చెప్పారు.  ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటిస్తానని, రాజన్న రాజ్యం తీసుకురావడానికి మనకు అండగా నిలబడిన ప్రతి పేదవాడికి నీతి, న్యాయం, ధర్మం విషయంలో తోడుగా ఉండాలని, వారి ఆకాంక్ష నెరవేర్చాలని మాకు సూచించినట్లు ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top