వైయ‌స్ఆర్‌సీపీ నేతల కుటుంబాలకు మాజీ మంత్రుల‌ పరామర్శ

ఓబేదు, రాజ్‌పాల్‌ యాదవ్‌ కుటుంబాలకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

 రేపల్లె: విజయవాడలో అరెస్టై రిమాండ్‌లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ చిత్రాల ఓబేదు, రేపల్లె పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ఆల రాజ్‌పాల్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులను వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. బాపట్ల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, కృష్ణా జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్‌ తదితరులు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కష్టకాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, చిత్రాల ఓబేడ్‌ అభిమానులు పాల్గొన్నారు.
 

Back to Top