ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు… 

దెందులూరు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతల నిరసన

దెందులూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వేమూరి రాధాకృష్ణా ఏబీఎన్‌లో “కొత్త పలుకు” పేరుతో పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌తో పాటు పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, తీవ్రంగా ఖండించారు. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా మరింత దిగజారిన భాషలో మాట్లాడుతున్న తీరు అనర్హమని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేశారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలకు స్థానం లేదని, రాజకీయ విమర్శలు పరిమితులను దాటకూడదని నేతలు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసు అధికారులను కోరారు. 

Back to Top