విజయవాడ: దళిత జాతి అభ్యున్నతి కోసం సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు అన్నారు. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125అడుగులు విగ్రహా నిర్మాణ పనులను ఎస్సీ కమిషన్ సభ్యులు కాలే పుల్లారావు, చెల్లం ఆనంద ప్రకాష్, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు నలుకుర్తి రమేష్, బూదాల శ్రీనివాసరావు , జమ్మలమూడి మార్కు , కాలే వెంకట రమణ, లేళ్ళపూడి లాజరు, కండిలా డేవిడ్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లా రావు మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందన్నారు. దళిత జాతి నేడు ఇంత అభివృద్ధి సాధిస్తోందంటే అది ఒక్క డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. అలాంటి గొప్ప నాయకులు అంబేద్కర్‌కు సముచిత గౌరవం ఇస్తూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. దళిత సంక్షేమం కోసం, అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు.