అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సేవయే ముఖ్యం

శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

చీపురుప‌ల్లిలో   “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” కార్యక్రమం

విజ‌య‌న‌గ‌రం:  అధికారంలో ఉన్నా..ప్ర‌తిప‌క్షంలో ఉన్నా మాకు ప్ర‌జా సేవ‌యే ముఖ్య‌మ‌ని శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఉద్ఘాటించారు. సోమ‌వారం చీపురుపల్లి నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” కార్యక్రమం పోస్ట‌ర్‌, రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో..క్యూఆర్ కోడ్ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు  కూటమి వైఫల్యాలను ఎండగడుతూ, ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని పిలుపునిచ్చారు.  కార్య‌క్ర‌మంలో  జిల్లా జడ్పీ చైర్మన్,  పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, కిల్లి సత్యనారాయణ  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top