తార‌క్ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

గుంటూరు: సోషల్ మీడియా యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌రామ‌ర్శించి అండగా నిలిచారు. తార‌క్‌పై సీఐడీ అధికారుల‌తో కూట‌మి ప్ర‌భుత్వంపై తప్పుడు కేసు పెట్టి.. అక్రమంగా  అరెస్ట్ చేయించారు. ఈ కేసులో తారక్ ప్రతాప్ రెడ్డికి రిమాండ్ విధించారు. దీంతో తారక్ ఇంటికి గుంటూరు తూర్పు ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా, మీడియా సెక్రటరీ వజ్రాల జై రామిరెడ్డి, వాలంటీర్ల విభాగం జోనల్ అధ్యక్షుడు సీతా రామిరెడ్డి, ప‌లువురు పార్టీ నాయకులు వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తారక్ కుటుంబానికి భరోసా క‌ల్పించారు.

Back to Top