తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్ఆర్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండు చేశారు. ఆలయ పవిత్రత మంట కలిపే విధంగా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. శనివారం వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద భూమన మీడియాతో మాట్లాడుతూ.. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ అపవాదు వేశారని.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు వాఖ్యలు చేయడం సరికాదన్నారు. మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని.. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మాజీ సీఎం వైయస్ జగన్‌ను శ్రీవారి దర్శనానికి రాకుండా అడ్డుకున్నారు వేంకటేశ్వరస్వామిని వైయస్ జగన్ ఎన్నోసార్లు దర్శించుకున్నారు. రాజకీయ ప్రాబల్యం కోసం చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేశారు. వెంకన్న చౌదరి తిరుమలలో అన్యమతస్తులకు ప్రవేశం లేదంటూ పెద్ద ఎత్తున బోర్డులు పెట్టారు. వెంకన్న చౌదరి వెంకన్నకు సేవ చేయాలి. చంద్రబాబుకు కాదు. వైయస్ జగన్ పర్యటన రద్దువ్వగానే వెంటనే ఫ్లెక్సీలు తీసేశారు. రోజుకు 700 మందికి పైగా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తారు. ఏనాడు డిక్లరేషన్ తీసుకోలేదు’’ అని భూమన అన్నారు. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విశాఖ పట్నం: రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి చంద్రబాబు లాగారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు లడ్డూని తెరపైకి తెచ్చారు. సీఎం లడ్డూపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని మొదట మాట్లాడారు. కల్తీ లడ్డూ ఎక్కడ వాడారో తనకు తెలియదని మళ్ళీ అంటున్నారు. వైఎస్ జగన్ నేరుగా ఎదుర్కొనలేక చంద్రబాబు.. దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు .. అసలు వాస్తవాలు తెలియాలంటే లడ్డూ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు వేసిన సిట్‌పై నమ్మకం లేదు.. తిరుపతి వెళ్తామంటే నోటీసులు ఇచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా?. గతంలో వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ఆర్ తిరుపతి వెళ్లలేదా.. మళ్లీ వైయస్ జగన్ తిరుపతి వెళతారు. ఎవరు ఆపుతారో చూస్తాం వైయస్ జగన్‌కు వెంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తి చంద్రబాబుకు లేదు. రుషికొండ టీటీడీ దేవాలయాన్ని వైయస్ జగన్ హయాంలోనే నిర్మించారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా ప్రత్యేక పూజలు నిర్వహించాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు పవన్ కళ్యాణ్ దీక్షలు చేయాలి. జనసేన ఎమ్మెల్యే దళిత ఉద్యోగిపై దాడి చేసినందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి’ డిక్లరేషన్ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారు?: మాజీ మంత్రి అంబటి రాంబాబు అసత్య ప్రచారంతో టీటీడీ ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారు. డిక్లరేషన్ బోర్డు పెట్టి ఎందుకు తీసేశారు?. బాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా వైయస్ జగన్ తిరుమల వెళ్లారు. అప్పుడు డిక్లరేషన్ ఎందుకు అడగలేదు?. వైయస్ జగన్‌ను మానసికంగా వేధించాలని కుట్రలు చేస్తున్నారు.గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆలయంలో పూజలు నిర్వహించారు కూటమి నేతల మెదడులోనే ‘కల్తీ’: వైయస్ఆర్‌సీపీ నేత పోతిన మహేష్ కూటమి ప్రభుత్వం గత పది రోజులుగా తిరుమల వేంకటేశ్వరస్వామిని ప్రచార అస్త్రంగా మార్చుకుంది. ఇష్టానుసారంగా మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలి. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు చేసిన పాపాలకు వారికే శిక్షలు పడాలని ఆ దేవుడిని కోరుతున్నాం. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నాం. కల్తీ లడ్డూలో జరగలేదు... కల్తీ నెయ్యిలో జరగలేదు. కూటమి నేతల మెదడులోనే కల్తీ జరిగింది. పాదయాత్ర ముగించుకుని జగన్ నేరుగా తిరుమల వెళ్లారు. ఆ రోజు చంద్రబాబు ఎందుకు డిక్లరేషన్ అడగలేదో సమాధానం చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో కలిసి వెళ్లినపుడు ఆ రోజు బీజేపీ నేతలు ఎందుకు డిక్లరేషన్ అడగలేదు?. తిరుమల వెంకన్న స్వామిపై వైయస్ జగన్‌కి అపారమైన నమ్మకం ఉంది. కాబట్టే తిరుమలతో నవనీత సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. జీతాలు రెట్టింపు చేశారు. ఇళ్లస్థలాలు ఇచ్చారు. ఏ రోజు ఏ మతంలో ఉంటాడో.. ఏ కులంలో ఉంటాడో తెలియని పవన్‌ను చంద్రబాబు డిక్లరేషన్ అడగాలి. ఏలూరు జిల్లా: తిరుపతి లడ్డు పవిత్రతను.. దెబ్బతీస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసనగా చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామవరపుకోట వీరభద్రస్వామి ఆలయంలో చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు, మద్ది ఆంజనేయస్వామి గుడి మాజీ చైర్మన్ సరితారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వినర్ మిడతా రమేష్, పార్టీ శ్రేణులు పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి: చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పూజలు చేశారు. బొమ్మూరు ఆలయంలో మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాజానగరం ఆలయంలో వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పూజలు నిర్వహిస్తున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా: తిరుమల లడ్డులో కల్తీ జరిగినట్టుగా అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు కల్లూరు అర్బన్ కృష్ణ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్ జిల్లా: యర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో చంద్రబాబు తిరుమల లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. లడ్డూ పవిత్రతను కాపాడే విధంగా అభిషేకాలు చేశారు. అనంతపురం జిల్లా: చంద్రబాబు పాపం ప్రజలపై పడకూడదని వైయస్ఆర్‌సీపీ నేతలు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం శ్రీకంఠం సర్కిల్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వారికి పూజలు జరిగాయి. తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం మాజీ సీఎం వైఎన్ జగన్ వెళ్తుంటే.. అనుమతి లేదని చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం బాధాకరం అని, తిరుమల లడ్డూలపై అసత్య చేసిన చంద్రబాబును ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. విజయవాడ: తిరుమల పవిత్రతను,శ్రీవారి ప్రసాదం విశిష్టతను, టీటీడీ పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం విజయవాడలో వైయస్ఆర్‌సీపీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. లబ్బీపేటలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామి ఆలయంలో సెంట్రల్ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్ మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు చేశారు. డిక్లరేషన్ ఎందుకివ్వాలి: దేవినేని అవినాష్ ఇది మంచి ప్రభుత్వం కాదు.. ప్రజలను నిండా ముంచిన ప్రభుత్వం. అన్ని రకాలుగా ప్రజలను మోసం చేశారు. పరిపాలనలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకున్నారు. అనేక మార్లు తిరుమల వెళ్లిన వైఎస్ జగన్.. డిక్లరేషన్ ఎందుకివ్వాలి. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబు, టీడీపీకే చెల్లుబాటు. నేను విదేశాల్లో చదువుకున్నప్పుడు ఏపీ గురించి గొప్పగా చెప్పుకునే వారు. ఈ రోజు చంద్రబాబు వల్ల రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతింది. వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో విఫలం చెందారు. 22