నాయకుడిగా ఎలా ఎదగాలో వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకో

దోపిడీ దొంగల పక్కన చేరి నీతులు చెబుతావా.. పవన్‌

రాజకీయాలకు పట్టిన చీడపురుగులు చంద్రబాబు

దోపిడీ సొమ్ము తండ్రీకొడుకులు ఏదేశంలో దాచారో తేలాలి

చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌లకు లేఖ రాస్తా

సీఎం వైయస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోతారు

రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన సాగుతోంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు లక్ష్మీపార్వతి

 

తాడేపల్లి: దోపిడీ దొంగల పక్కన చేరి నీతులు చెప్పడం కాదు.. నాయకుడిగా ఎలా ఎదగాలో సీఎం వైయస్‌ జగన్‌ను చూసి పవన్‌ కల్యాణ్‌ నేర్చుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి సూచించారు. రాజకీయాలకు పట్టిన చీడపురుగు చంద్రబాబు అని, ఐదేళ్లు రాష్ట్రం మీద పడి విచ్చలవిడిగా దోచుకున్నాడన్నారు. తండ్రీకొడుకులిద్దరూ రహస్యంగా జీవోలు విడుదల చేసి రూ.లక్షల కోట్లు దోచుకొని విదేశీ పర్యటనల పేరుతో వాటిని తరలించారన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోయిందని, ప్రజా పాలన అనే పదానికి నిర్వచనం చెబుతూ సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలిస్తున్నాడని లక్ష్మీ పార్వతి చెప్పారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబుపై విచారణ చేయాలని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌లకు లేఖ రాస్తానన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. ఐదు నెలల్లో ఇంత పారదర్శకపాలన దేశంలో ఎక్కడ జరిగిందో చూపించాలన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీ పార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారనే భ్రమలో పవన్, చంద్రబాబు ఉన్నారన్నారు. ఎంత వయస్సు వచ్చిందనేది కాదు.. ఎంత బుద్ధి వచ్చిందనే విషయాన్ని గుర్తించి ప్రవర్తించాలని షేక్‌స్పియర్‌ ఒక మాట చెప్పారన్నారు. ఐదు సంవత్సరాలు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దేశంలోనే ఆంధ్రరాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశాడన్నారు. ఏపీలో పరిస్థితి అతిదారుణంగా ఉన్నాయని, ఏపీ కంటే బిహార్‌ వెయ్యి రెట్లు బెటర్‌ అని జాపాన్‌కు చెందిన ఓ వ్యక్తి చెప్పాడని గుర్తుచేశారు. చంద్రబాబు 6,17,585.19 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని వైయస్‌ఆర్‌ సీపీ పుస్తకం కూడా రిలీజ్‌ చేసిందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ కూడా ఒక నివేదిక ఇచ్చిందన్నారు.

రహస్యంగా వందల జీఓలు విడుదల చేసిన తండ్రీకొడుకులు ఫ్యామిలీ టూర్‌ పేరుతో దోపిడీ చేసిన డబ్బును విదేశాల్లో దాచిపెట్టారన్నారు. డబ్బు ఎక్కడ దాచారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తాను చంద్రబాబు అవినీతిపై వేసిన కేసు ఏసీబీలో ప్రస్తుతం విచారణ జరుగుతుందన్నారు. సుప్రీం కోర్టు ఏ కేసులో స్టే ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. 14 ఏళ్ల పాటు స్టే మీద ఉన్న కేసు ప్రస్తుతం ఏసీబీ విచారణ చేస్తుందన్నారు. చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌కు కూడా లేఖ రాస్తానని వివరించారు. అవినీతి చక్రవర్తిపై ఏ విధమైన విచారణలు ఉండవా..? అని పేర్కొననున్నట్లు చెప్పారు.

రివర్స్‌టెండరింగ్‌ విధానంతో పోలవరంలో రూ.850 కోట్లు ఆదా, వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి రూ.61 కోట్లు ఆదా చేశామన్నారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన సాగుతోందని, సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో అవినీతి రహిత పాలన జరుగుతుందన్నారు. చంద్రబాబు స్నానానికి పుష్కరాల్లో రూ. 600 కోట్లు ఖర్చు చేసి 29 మందిని పొట్టనబెట్టుకుంటే కేసు కూడా లేదని, వాటిపై పవన్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.  

ప్రజా పాలన అనే పదానికి ఒక నిర్వచనం చెబుతూ సీఎం వైయస్‌ చేస్తున్న మంచి చూసి ప్రజలంతా మెచ్చుకుంటున్నారన్నారు. నాలుగు నెలల్లోనే 19 చట్టాలు చేశారు. రైతు భరోసా, మహిళలకు 50 శాతం పదవుల్లో, పనుల్లో రిజర్వేషన్, గ్రామ సచివాలయాల ద్వారా లక్షల ఉద్యోగాలు, వలంటీర్‌ వ్యవస్థ, ప్రతి జనవరి ఉద్యోగాల నెలగా ప్రకటించి పారద్శకమైన పాలన అందిస్తున్నాడన్నారు. ఎన్టీఆర్, వైయస్‌ఆర్‌లను అధిగమించిన పాలన వైయస్‌ జగన్‌ నేతృత్వంలో సాగుతుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ కచ్చితంగా పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిపోతాడన్నారు. ఒక్కడే వన్‌ మెన్‌ ఆర్మీలా ముందుకెళ్లి 151 సీట్లు సాధించాడన్నారు. లీడర్‌గా ఎలా ఎదగాలో సీఎం వైయస్‌ జగన్‌ను చూసి పవన్‌ చేర్చుకోవాలని లక్ష్మీపార్వతి సూచించారు.

Read Also: పచ్చ నేతలే భూ బకాసురులు

తాజా వీడియోలు

Back to Top