పచ్చ నేతలే భూ బకాసురులు

విశాఖ భూ దంధాలపై ఫిర్యాదుల సునామీ

విశాఖలో భూ కుంభకోణాల గురించి వైయస్సార్ కాంగ్రెస్ ప్రబుత్వం విచారణ చేపట్టింది. దీనిపై సిట్ ఏర్పాటు చేసిన మూడు రోజుల్లోనే 300కు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంటే గత టీడీపీ ప్రభుత్వం ఏ స్థాయిలో భూ ఆక్రమణలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. భూ అక్రమాలపై సామాన్యులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ భూములను ప్రభుత్వేతర భూములుగా మార్పు చేసిన కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులతో కుమ్మక్కై ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా ప్రభుత్వ భూముల కేటాయింపులు చేయడం, రికార్డుల తారుమారు, మాజీ సైనికుల భూముల అమ్మకాలపై ఎన్‌.ఓ.సీలు వంటి దారుణాలెన్నో సిట్ ఫిర్యాదుల్లో బయటపడుతున్నాయి. భూ పత్రాలున్నా కూడా విచ్చలవిడిగా ఆక్రమణలు జరిపినట్టు ఈ ఫిర్యాదుల్లో తెలుస్తోంది. 

అప్పట్లో విశాఖకు చెందిన టీడీపీ మంత్రే స్వయంగా మా పార్టీ నేతలే భూ కబ్జాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన విషయం మర్చిపోలేం. కబ్జాదారులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేనే భయం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనమైంది. వేలాది ఎకరాల రికార్డులు మాయం అవ్వడం, దానికి హుద్ హుద్ తుఫాను కారణం అని అధికారులతో చెప్పించడం కూడా నాటి ప్రభుత్వం భూ కబ్జాలను ఎంత యద్ధేచ్ఛగా సాగించిందో చెప్పడానికి చిన్న ఉదాహరణ. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్న విశాఖ భూ కబ్జాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. సాక్ష్యాలతో సహా పచ్చనేతల భూ బకాసరు పర్వాన్ని ప్రజలముందుంచారు. కానీ చంద్రబాబు మాత్రం బహిరంగ విచారణ జరపకుండా తూతూమంత్రంగా దర్యాప్తు సాగించి అక్రమార్కులకు కొమ్ముకాసారు. 
ఇదో ఉదాహరణ
విశాఖలో గీతం వర్సిటీ సమీపంలో ఉన్న34ఎరాల భూములను కేటాయించమని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర విభజనకు ఆమోదం జరగడం, రాజధాని గురించి స్పష్టత లేకపోవడంతో భూ కేటాయింపుల కమిటీ గీతం అభ్యర్థనను  తిరస్కరించింది. అయితే అదే భూమిని ప్రభుత్వ సంస్థలకు కేటాయింపులు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే ప్రభుత్వ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు రద్దు చేసేసారు. భూ కేటాయింపుల విషయంలో మార్గదర్శకాల ప్రకారం చూస్తే ప్రభుత్వ విభాగాలకు ప్రాధాన్యతనివ్వాలి. కానీ తన బినామీలైన ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయడానికే చంద్రబాబు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. 
సిట్ ముందు బాధితుల వేదన
వైసీపీ ప్రభుత్వం గ్రేటర్ విశాఖ సహా 13 మండలాల పరిధిలో సిట్ ఏర్పాటు చేయగా వేరే మండలాల నుంచి కూడా ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో వస్తున్నారు. దీనిబట్టి చూస్తే భూ కబ్జాల పర్వం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సిట్ పరిధిని పెంచమంటూ బాధితుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయ్. దీనిపై ముఖ్యమంత్రితో సంప్రదించుతామని ఎంపీ విజయసాయిరెడ్డిగారు హామీ కూడా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో సిట్ ఏర్పాటు చేసినా దానివల్ల బాధితులకు న్యాయం జరగలేదు. చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ లో ఫిర్యాదులు చేసి, న్యాయం జరగలేదంటూ బాధితులు మళ్లీ నేడు కొత్తగా ఏర్పాటుచేసిన సిట్ అధికారుల ముందు మొరపెట్టుకుంటున్నారు. నేడు అలాంటి అక్రమాలన్నిటినీ వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 

Read Also: చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ తో పవన్‌ షో  

Back to Top