మజ్జి శ్రీనివాస్‌ను విడుదల చేయాలి

పోలీసు స్టేషన్‌ ఎదుట వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల ఆందోళన
 

విజయనగరం: నెల్లిమర్లలో ఉద్రిక్తత నెలకొంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మజ్జి శ్రీనివాస్‌ను విడుదల చేయాలని డిమాండు చేస్తూ జామి పోలీసు స్టేషన్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్‌కు చేరుకొని నిరసన చేపట్టారు. వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు కొలగట్ల వీరభద్రస్వామి బొత్స అప్పలనరసయ్య, బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సంరద్భంగా కొలగట్ల మాట్లాడుతూ..సర్వే పేరిట ట్యాబ్‌లు తీసుకొని వచ్చి వైయస్‌ఆర్‌సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి ఓటర్‌ జాబితాలో ఉన్న పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. సర్వే సమయంలో ఓటర్‌ లీస్టు తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. సర్వే చేసిన వారిని వైయస్‌ఆర్‌సీపీ నేతలు నిలదీస్తే మమ్మల్ని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఇలాంటి వ్యక్తులు ట్యాబ్‌లు తీసుకొని వచ్చి సర్వేల పేరుతో ఓట్లు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తప్పుడు దారుల్లో వెళ్తుందని మండిపడ్డారు. టీడీపీ చేస్తున్న తప్పుడు విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. 
 

Back to Top