చంద్రబాబు పాలనలో అన్నివర్గాలకు అన్యాయం

చంద్రబాబుది దోపిడీ పాలన

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు 

శ్రీకాకుళం: అన్ని వర్గాలు టీడీపీపై వ్యతిరేకంగా ఉన్నారని, వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.చంద్రబాబు పాలనలో మత్స్యకారులకు అన్యాయం జరిగిందన్నారు. నాగరికతకు దూరంగా  అభివృద్ధికి దూరంగా మత్స్య కారులు బతుకుతున్నారు.వారి జీవన విధానంలో మార్పులు రాలేదన్నారు.వారికి ఎంబిసి ఇస్తే తప్పేమిటి అని ప్రశ్నించారు.మత్స్య కారుల అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు.యాదవులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని వైయస్‌ జగన్‌ నిర్ణయించారని తెలిపారు.నలుగురు బ్రాహ్మణులకు సీట్లు ఇచ్చిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని తెలిపారు.

జీతాలు అడిగిన నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు దూషించారు. విజ్ఞపన చేస్తే వినే  సహనం చంద్రబాబుకు లేదు.నాయీ బ్రాహ్మణులకు జీతాభత్యాలు పెంచమని అడిగే హక్కులేదా అని ప్రశ్నించారు.చంద్రబాబు బ్రాహ్మణులకు కూడా వేధించారు.టీటీడీలో దోపిడీని రమణ దీక్షితులు చెప్తే అతన్ని బయటకు పంపారు.సామాజిక వర్గాల పట్ల గతంలో  చంద్రబాబు దిగజారుడు మాటలను గుర్తుచేశారు. అలాంటి వారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు.నాయకులు ప్రజలకు సేవ చేసే నాయకులు మాత్రమే..ఏ ప్రభుత్వం వచ్చిన రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిందే..చంద్రబాబు దోపిడీలకు పాల్పడుతున్నారు.చంద్రబాబు ఈ ఐదు సంవత్సరాల్లో కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఏమిటని.. ప్రజల సంపదను ధనవంతులకు,బంధువులకు  పంచారని ధ్వజమెత్తారు.

Back to Top