చంద్రబాబుకు ఓటు అడిగే హక్కులేదు

ప్రజలను మభ్యపెట్టడానికి దారులు వెతుకుతున్నారు

వైయస్‌ జగన్‌ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం:అపోహలు సృష్టించి చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు.40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రజలకు మేలు చేశామని చెప్పి ఓటు అడిగే పరిస్థితిలో లేరన్నారు.ప్రజలను మభ్య పెట్టడానికి నిరంతరం దారులు వెతుక్కునే పనిలో చంద్రబాబు పడ్డారన్నారు. ప్రధానితో యుద్ధం అని ప్రకటించడం,ఏపీకి సంబంధంలేని కేసీఆర్‌ను ఏపీ రాజకీయాలతో ముడిపెట్టడం,పచ్చమీడియా సాయంతో వైయస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా దూషించడం వంటి చర్యలు ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు.చంద్రబాబుకు రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయన్నారు. చంద్రబాబు మీతిమిరిన ఖర్చు,హంగామా ప్రజలు  అర్థం చేసుకుంటున్నారని,ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి  సిద్ధమవుతున్నారన్నారు.చంద్రబాబు రాష్ట్ర ప్రజల రక్తం పిండి దోచుకున్న సొమ్మును ఇతర రాష్ట్రాలలో ఎన్నికలకు పెట్టుబడి పెడతున్నారన్నారు.వైయస్‌ఆర్‌ పరిపాలన చూసిన ప్రజలు ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ పాలన కావాలని ఎదురుచూస్తున్నారన్నారు.కొత్త సంవత్సరంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన వస్తుందని, అదే రాష్ట్ర ప్రజలకు ఉగాది కానుక అని తెలిపారు.

Back to Top