రాష్ట్రంలో దొంగలు పడ్డారు

ప్రజాస్వామ్యంలో చంద్రబాబుకు నూకలు చెల్లిపోయాయి

చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారు

తెలుగుదేశం వెబ్‌సైట్‌ను ఎందుకు మూసేశారు..?

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం:తెలంగాణలో దర్యాప్తు జరుగుతుంటే ఏపీలో ఉండి చంద్రబాబు ఎందుకంత ఉలిక్కిపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.విశాఖపట్నంలో ఆయన వైయస్‌ఆర్‌సీపీ కార్యాయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐటి గ్రిడ్‌ దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయని,ఐటి గ్రిడ్‌ సీఈవో అశోక్‌తో మీకున్న సంబంధమేమిటని సీఎం చంద్రబాబును సూటి ప్రశ్నించారు.సేవా మిత్ర యాప్‌ను ఐటిగ్రిడ్‌ తయారుచేసింది వాస్తవం కాదా అని అన్నారు. ఏపీలో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురికావడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆధార్‌ సమాచారం,  ఎన్నికల కమిషన్‌ వద్ద ఉండాల్సి సమాచారం కలర్‌ఫోటోలతో  ఏపీ ప్రభుత్వం తస్కరించిందని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది బ్యాంకు ఖాతాల వివరాలు ఐటిగ్రిడ్‌ సంస్థ వద్ద  ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పల్స్‌ సర్వే  వివరాలు కూడా ప్రైవేట్‌ సంస్థ వద్ద ఉన్నాయన్నారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరాలు కూడా ఐటిగ్రిడ్‌లో సంస్థలో ఉన్నాయన్నారు.

డేటా చోరీపై ముఖ్యమంత్రి,ఐటి మంత్రి,మంత్రులు,అధికారులు స్పందిస్తున్న విధానం చూస్తుంటే వాస్తవాలు తేటతెల్లమవుతున్నాయన్నారు. ఐటిగ్రిడ్‌ సీఈవో అశోక్‌ ప్రభుత్వ సంబంధింత సమావేశాల్లో పాల్గొనడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.పరార్‌లో ఉన్న ఈశోక్‌కు  తెలంగాణ పోలీసులు లుక్‌అవుట్‌ నోటిస్‌ కూడా ఇచ్చారని,  ఈ నేపథ్యంలో నేను నిజాయితీపరుణ్ని అని పోలీసులకు ఎందుకు చెప్పుకోవడంలేదని ప్రశ్నించారు. ఎందుకు దాకోవలసి వచ్చిందో సమాధానం చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సేవా మిత్ర యాప్‌ తయారుచేసింది ఐటిగ్రిడ్‌ సంస్థ అని  తెలిపారు. ఎందుకు సేవా మిత్ర యాప్‌  వెబ్‌సైట్‌లో కనబడటంలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం వెబ్‌సైట్‌ను ఎందుకు మూసివేశారు అని ప్రశ్నించారు. చేసిన తప్పుని మరిచిపోయి మళ్లీ పీఎస్‌లో కంప్లెంట్‌లో ఇస్తారా అని ప్రశ్నించారు. ఒక చోరి జరిగితే..ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఏ తప్ప చేయకపోతే ఎందుకు అశోక్‌ అనే వ్యక్తి పరార్‌లో ఉన్నాడు.ఎందుకు వైబ్‌ సైట్‌ను మూసివేయాల్సి వచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఎన్టీఆర్‌ కంటే  చంద్రబాబు బ్రహ్మండంగా నటిస్తున్నారన్నారు. టీడీపీ చర్యలు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దొంగపడ్డారని ఎద్దేవా చేశారు.ప్రజాస్వామ్యంలో చంద్రబాబుకు నూకలు చెల్లిపోయాయని, ప్రజలందరూ ఛీ కొడుతున్నారన్నారు.చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. ఒక హామీ కూడా చంద్రబాబు నేరవేర్చలేదన్నారు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేశారన్నారు స్పీకర్‌ బరితెగించారని  ఇంత దిగజారిపోయిన స్పీకర్‌ను ఎక్కడా చూడలేదన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top