ధర్నా పేరుతో చంద్రబాబు హంగామా

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి

 విజయవాడ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈవెంట్‌ మేనేజర్‌గా మరోసారి నిరూపించుకున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసీ కార్యాలయం వద్ద చంద్రబాబు డ్రామాలు ఆడారని ఆరోపించారు. ధర్నా పేరుతో చంద్రబాబు హంగామా సృష్టించారని తెలిపారు.

చంద్రబాబు డ్రామాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసీని కలవడంపై చంద్రబాబు తొలుత ముఖ్యమంత్రిగా కలిశానని.. ఆ తర్వాత పార్టీ అధినేతగా కలిశానని పొంతన లేని మాటలు మాట్లాడుతన్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబు పోలీసులతో నెట్టించుకోని.. వడదెబ్బతో పడిపోయే విధంగా డ్రామా చేస్తారని ఆరోపించారు. చంద్రబాబు హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కారించారని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్ణయాలను చంద్రబాబు తప్పుపడుతున్నారని మండిపడ్డారు.

 

Back to Top