తాడేపల్లి: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వైయస్ జగన్ స్పందిస్తూ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన దీర్ఘాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యం, ఆనందాలతో కూడిన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అలాగే కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు సుదీర్ఘ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కూడిన జీవితం కలగాలని ఆకాంక్షించారు. ఇద్దరు నాయకులు ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని, ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు మరింత పెరగాలని వైయస్ జగన్ తన శుభాకాంక్ష సందేశంలో పేర్కొన్నారు.