తిరుపతి: చంద్రబాబు ఆదేశాలతోనే హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో సాధు పరిషత్ తిరుపతిలో సమావేశం నిర్వహించి అందులో దివంగత వైయస్ఆర్‌ర్, వైయస్ జగన్‌తో పాటు, తనపై తీవ్రమైన విమర్శలు, అబద్ధాలు, దూషణలు చేశారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమన, ఆ సాధు పరిషత్ అధ్యక్షుడు, ఇతర ప్రసంగకులు అయిన శ్రీనివాసానంద సరస్వతి, అట్లూరి నారాయణ వికృతమైన వ్యక్తిగత జీవితం ఎలాంటిదో వివరించారు. వీరంతా ఈ సమావేశంలో కూటమి రెండేళ్ల పాలన సభలో ప్రదర్శించిన ప్లకార్డులు తీసుకొచ్చి ప్రదర్శించారని చెబుతూ హిందువుల ఐక్యత కోసం తెలుగుదేశం పార్టీలో చేరాలని పిలుపునిచ్చిన విషయంపై ఆక్షేపించారు. కాషాయ వస్త్రాలు ధరించి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసే రాక్షస డీఎన్‌ఏ కలిగిన వీరు ధర్మం గురించి మాట్లాడితే హిందూ సమాజం తలెత్తుకోగలదా? అని ప్రశ్నించారు. వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్ర చరిత్రలో హిందూ ధర్మాన్ని పరిరక్షించింది, తిరుమల పవిత్రతను కాపాడింది దివంగత వైయస్సార్, ఆయన కొడుకు వైయస్ జగన్‌లేనని, దానిపై ఎక్కడైనా ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. వీఐపీ బ్రేక్ దర్శనం ఆశ చూపించి దాదాపు 700 మందిని మీటింగ్ కి పిలిపించి ఆ తర్వాత కనీసం వారికి రూ.300ల దర్శనం కూడా కల్పించకపోవడంతో నిర్వాహకులతో గొడవకు దిగిన వీడియోలను కూడా విడుదల చేస్తామని భూమన చెప్పారు. బీఆర్ నాయుడు అంటేనే బొంకు రంకు నాయుడని, కొండ మీద రహస్యంగా కూర్చుని కొండ కింద ఇలాంటి కోతుల్ని బీఆర్ నాయుడు ఆడిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు పనిచేసిన టీటీడీ అధ్యక్షుల్లో అథామథముడు ఈ బీఆర్ నాయుడని, హిందూ ముసుగులో వైయస్సార్, వైయస్ జగన్ గారి మీద దాడి చేయించే కుట్రలో ప్రధాన కారకుడు ఈ బొంకు రంకు నాయుడేనని మండిపడ్డారు. కూటమి రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన తెలిపినందుకు 150 మందిపై కేసు పెట్టిన పోలీసులు, హిందూ ధర్మ పరిరక్షణ ముసుగులో రాజకీయ ప్రసంగాలు చేయడంతోపాటు పచ్చి అబద్ధాలు, దూషణలు చేసిన శ్రీనివాసానంద సరస్వతి, శివానంద స్వామి, అట్లూరి నారాయణలపై ఎందుకు కేసు నమోదు చేయలేదని భూమన కరుణాకర్‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: ఆ ప్లకార్డులు ఈ ప్లకార్డులు ఒక్కటే: తెలుగు దొంగల పార్టీ (టీడీపీ) అనుబంధ సంస్థ సాధు పరిషత్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వామి పేరుతో తనను తాను ప్రచారం చేసుకుంటున్న శివానందస్వామి దానికి అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, సభ్యుడు కూడా. ఆయన టీడీపీ రాజకీయ అజెండాతో పనిచేస్తూ గతంలో వైయస్సార్ మీద, ఇప్పుడు వైయస్ జగన్ గారి మీద, నా మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. సనాతన ధర్మ పరిరక్షకులమనే ముసుగులో టీడీపీ రాజకీయ అవసరాల కోసం పనిచేయడమే ఆయన కర్తవ్యంగా కనిపిస్తుంది. రెండు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ఈ సాధు పరిషత్ సమావేశంలో ఏవైతే ప్లకార్డులు ప్రదర్శించిందో కూటమి రెండేళ్ల పాలనకు వాడిన ప్లకార్డులు కూడా అవే కావడం అందర్నీ ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేసింది. ఈ ప్లకార్డులు చూసి మొత్తం హిందూ సమాజమే నివ్వెరపోయింది. సాధు పరిషత్ సమావేశంలో వారు మాట్లాడిన మాటలు చూస్తే మాకెవరూ గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన పనిలేదని తమకు తామే ప్రకటించినట్టుగా ఉంది. వీరు మాట్లాడిన మాటలకు అలిపిరినే శుద్ధి చేయలి. వీరా హిందూ ధర్మాన్ని పరిరక్షించేది?: బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకి పరమ భక్తుడు, తిరుపతిలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే బ్రోకర్ అయిన అట్లూరి నారాయణ అనే వ్యక్తి హిందూ సంఘాల అధ్యక్షుడా? బాలిక మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నశ్రీకాకుళానికి చెందిన శ్రీనివాస సరస్వతి అనే మరో వ్యక్తి ఇప్పుడు టీడీపీతో రోజూ రెండు లెటర్లు అమ్ముకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. పేరులో తప్ప గుణంలో ఏమాత్రం సరస్వతి లేనటువంటి వాడు. రూ.500 ఇస్తే అర కిలో అశుద్ధాన్ని మింగడానికి కూడా వెనకాడని మరో వ్యక్తి ఘీంకారం. ఇతడు గతంలోనే నావద్దకు వచ్చి శివానంద స్వామి, శ్రీనివాస సరస్వతి గురించి చాలా ఆరోపణలు చేసి వెళ్లాడు. వీళ్లంతా చంద్రబాబు కపట నాటకంలో పాత్రలు మారి కాషాయ వస్త్రాలు ధరించి టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతో వీరి ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక గుంట నక్కల సభను నిర్వహించారు. ఆ సమావేశానికి హిందూ బంధువులంతా కలసి రండి అని పిలుపు నిచ్చి ఈ రాబందులంతా వాలాయి. శ్రీవారి సేవకుల ముసుగులో సాధువుల వేషంలో వచ్చి టీడీపీ జెండాలు మోసే కూలీలుగా బీఆర్ నాయుడు మార్చి ప్రదర్శన చేశారు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు పనికొచ్చేవారు కాదు. వీరంతా రాక్షస డీఎన్‌ఏ కలిగిన పరమ నీచ నికష్టులు ధర్మం గురించి మాట్లాడితే హిందూ సమాజం తలెత్తుకోగలదా? హిందువుల ఐక్యత అంటే తెలుగుదేశంలో చేరాలని పిలుపునిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షకులు వైయస్సార్, వైయస్ జగన్‌లే: రాష్ట్రంలో హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు పాటుబడింది ఎవరైనా ఉన్నారంటే అది గతంలో వైయస్సార్ గారు, ఇప్పుడు వైయస్ జగన్ గారు మాత్రమే. చంద్రబాబు పాలనంతా హిందూ ఆలయాల విధ్వంసమే జరిగింది. దేవుడి పేరుతో అరాచకాలు చేసి దేవుడిని రాజకీయాలు చేసే చంద్రబాబులో వీరు శ్రీవారిని చూసి తరిస్తున్నారు. వందల గుళ్లు కూలగొట్టిన చంద్రబాబు వీళ్ల కళ్లకు అపర విష్ణుమూర్తిగా కనిపిస్తున్నాడు. వీరు చేసింది హైందవ గర్జన కాదు.. స్వాముల ముసుగేసుకున్న పచ్చ దండు నక్కల మంద. వేయి కాళ్ల మండపం సహా రాష్ట్రంలో వందల ఆలయాలను కూల్చేస్తున్న చంద్రబాబు పాలనను రామ రాజ్యం అని కీర్తిస్తున్నారంటే వీరికి మూటలు భారీగా అంది ఉంటాయని అనుమానం లేకుండా చెప్పొచ్చు. రెండు కొండలను ఏడు కొండలుగా మార్చి జీవో ఇస్తే, వైయస్సార్ రెండు కొండలుగా మార్చేశాడని సమావేశంలో చెబుతున్నారు. వైయస్సార్ గారు తీసుకొచ్చిన జీవోను రద్దు చేస్తానని చర్చిలో ప్రకటించిన హిందూ వ్యతిరేకి చంద్రబాబు అన విషయం ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి. మండలానికి మూడు చర్చిలు నిర్మించాడని వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గొప్ప మనిషి వైయస్సార్ గురించి నోటికొచ్చినట్టు పేలితే సహించేది లేదు. శంగేరీ పీఠాధిపతి, చినజీయర్ స్వామీజి, పండిట్ రవిశంకర్, అహోబిలం, కంచికామకోటి వంటి వందల మంది పీఠాధిపతులతో సదస్సును నిర్వహించి వారిచ్చిన సూచనలు స్వీకరించి రామాయణ, మహాభారత కావ్యాలను అతి సులభ శైలిలో ముద్రించి పంచిన ఘనతతోపాటు స్వామి వారి పాదాల చెంత ఉన్న మంగళ సూత్రాలతో పేదలకు పెళ్లిళ్లు చేసిన గొప్ప మనిషి వైయస్సార్. ఊరూ వాడా భజనమండళ్లు నిర్వహించారు. రోజూ కోట్ల మంది భక్తులు చూసి తరించే శ్రీవారి భక్తి ఛానెల్‌ని కూడా ఆనాడు వైయస్సార్ గారే ఏర్పాటు చేశారు. బీఆర్ నాయుడు టీటీడీలో ఉద్యోగాలు అమ్మేసుకుంటున్నాడు: వైయస్ జగన్ గారి హయాంలో గోమాతకు విశిష్టమైన ప్రాధాన్యం కల్పించారు. కొండ కింద గోమాతను పూజించిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిత్యం జరుగుతూ అగ్నిహోత్రం మండుతోందంటే దానికి కారణం కూడా వైయస్ జగన్ గారే. ఆలయానికో గోమాత, నవనీత సేవ చేసింది కూడా వైయస్ జగన్ గారే. వంద మంది పీఠాధిపతులతో సదస్సు నిర్వహించి వారిచ్చిన సూచనలతో హిందూ మతంలోకి మారాలనుకునే అన్యమతస్తులకు కొండ మీద వేదికను ఏర్పాటు చేస్తే ఇప్పుడు లేకుండా చేసిన నీచులు చంద్రబాబు, బీఆర్ నాయుడు. శ్రీవారి దర్శన టికెట్ల విక్రయాలలో శ్రీనివాస్ వంటి దళారుల ప్రమేయం లేకుండా సమూల ప్రక్షాళన కూడా వైయస్ జగన్ గారి హయాంలోనే జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాతే శ్రీవారి ఆలయ ప్రతిష్ట రోజురోజుకీ మసకబారుతూ వచ్చింది. దైవ స్మరణ జరగాల్సిన తిరునగరిలో దయ్యాల భజన ప్రారంభమైంది. బీఆర్ నాయుడు అంటేనే బొంకు రంకు నాయుడు. కొండ మీద రహస్యంగా కూర్చుని కింద కోతుల్ని ఆడిస్తున్నాడు. శ్రీవారి భక్తులను తెలుగుదేశం కూలీలుగా ఆడిస్తున్నాడు. హిందూ ముసుగులో వైయస్సార్, వైయస్ జగన్ గారి మీద దాడి చేయించే కుట్రలో ప్రధాన కారకుడు ఈ బొంకు రంకు నాయుడు. టీటీడీ అధ్యక్షుల్లో అథామథముడు ఈ బీఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ ని కలవడానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. టీటీడీలో వేదపారాయణ దారుల పోస్టులు రూ. 10 లక్షలకు, ఇంజినీరింగ్ పోస్టులను రూ. 40 లక్షలకు అమ్ముకుంటున్న నీచ చరిత్ర బీఆర్ నాయుడిది. మమ్మల్ని తిట్టిన వారికి బీఆర్ నాయుడు వీఐపీ దర్శనం లెటర్లు ఇచ్చి అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నాడు. టీటీడీలో లడ్డూ, పరకామణి, మేలు చాటు వస్త్రం, శ్రీవాణి ట్రస్టు, తులాభారం.. ఇలా దేన్నీ వదలకుండా ప్రతిదాన్నీ తన కుట్ర రాజకీయాలకు వాడుకుంటున్నాడు. దళారులను నిర్మూలించిన మాది రాక్షస రాజ్యమా.. ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు పాలన రామ రాజ్యమా?: కూటమి వెన్నుపోటు పాలన మీద గళమెత్తితే పోలీసులు 150 మంది మీద కేసులు పెట్టారు. కానీ హిందూ ధర్మ పరిరక్షణ ముసుగులో సమావేశం ఏర్పాటు చేసుకుని రాజకీయ ప్రసంగాలు చేసిన దొంగ సన్యాసుల మీద మాత్రం ఒక్క కేసు కూడా పెట్టలేదు. చంద్రబాబు భజన సేవలో మునిగి తేలుతూ ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్న వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? స్వామి తీర్థాన్ని కూడా అమ్ముకునే వారు హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తారా? వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పి కనీసం 700 మందిని మీటింగ్ పేరుతో తీసుకొచ్చి ఆ తర్వాత కనీసం 300 రూపాయల దర్శనం కూడా కల్పించకుండా వదిలేస్తే వారంతా గొడవకు దిగారు. ఆ వీడియోలను కూడా మేం విడుదల చేస్తాం. దళారులను నిర్మూలించాం కాబట్టే మాది రాక్షస రాజ్యమా? దళారులను ప్రోత్సహించాడు కాబట్టి చంద్రబాబుది రామ రాజ్యమా? నన్ను తిరుపతి నుంచి తరిమేసే ధైర్యం వీరికి ఉందా? తిరుమల పవిత్రత, హిందూ ధర్మ పరిరక్షణపై బహిరంగ చర్చకు నేను సిద్ధమని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు.