ప్రజల సొమ్ముతోనే చింతమనేని శ్రీమంతుడు

చింతమనేని అరాచకాలకు ప్రజలే బుద్ధిచెబుతారు

వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కొఠారు  అబ్బయ్య చౌదరి

పశ్చిమగోదావరి: ప్రజల సొమ్ముతో ఎమ్మెల్యే  చింతమనేని  శ్రీమంతుడు అయ్యారని వైయస్‌ఆర్‌సీపీ దెందులూరు సమన్వయకర్త కొఠారు అబ్బయ్య చౌదరి ధ్వజమెత్తారు. ఏలూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.ప్రజల సొమ్ము కాజేసి ఆస్తులు కూడగట్టిన చింతమనేనికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రజల డబ్బును ప్రజలకిస్తూ  చింతమనేని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. పోలవరంలో 25  కిలోమీటర్లు గ్రావెల్‌ అమ్ముకున్నారని మండిపడ్డారు. మట్టి,ఇసుక తరలించి అక్రమాలకు పాల్పడ్డారన్నారు.  చింతలపూడి నియోజకవర్గం బుట్టాయిగూడెంలో  130 ఎకరాల పొలాన్ని బినామీ పేరుతో కొనుగోలు చేసిన సంగతి దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికి తెలుసునన్నారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలి అని చెప్పుకునే చింతమనేని  దుగ్గిరాలలో ఎటువంటి భవనాలు నిర్మించుకున్నారో  ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.

అమరావతి,విశాఖపట్నం,హైదరాబాద్‌లలో భూములు కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు. మద్యం షాపుల్లో 30 శాతం వాటా తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకున్నారు. చింతమనేని అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం ఒక ఎత్తయితే..దెందులూరు నియోజకవర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీయడం మరో ఎత్తు అన్నారు. వట్లూరు గ్రామంలో  ఎస్సీ, బీసీల భూములను లాక్కొలేదా అని ప్రశ్నించారు. పెన్షన్‌ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడి ఎలా తిట్టారో ప్రజలందరూ చూశారన్నారు. అధికారులను సైతం చింతమనేని గౌరవించడం లేదన్నారు.వనజాక్షిని ఎలా దూషించారో అందరికి తెలుసు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చింతమనేనికి బుద్ధి చెబుతారన్నారు.మంచి వైపు ఉండాలో,చెడ్డు వైపు ఉండాల్లో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Back to Top